టి20 వరల్డ్ కప్ లో భాగంగా అటు మ్యాచ్లు అన్నీ కూడా హోరాహోరీగా జరుగుతున్న సమయంలో అటు వరుణుడు మాత్రం పగబట్టినట్లుగానే వ్యవహరిస్తున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ లో కీలకమైన మ్యాచులు కూడా వర్షార్పణం అయిపోయాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దిగ్గజ జట్లు ఊహించని కష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఇకపోతే ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో కీలకమైన మ్యాచ్కు టీమిండియా సన్నద్ధం అవుతూ ఉంది.


 ఆడి లైట్ వేదికగా ఈ మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ పై విజయం సాధించి సెమీస్ అవకాశాలను మరింత పదిలం చేసుకోవాలని రోహిత్ సేన వ్యూహాలను సిద్ధం చేసుకుంది. అయితే భారత్ ఆశలపై వరుణుడు నీళ్ళు చల్లే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. ఆడి లైట్ వేదికగా జరగబోయే పోరుకు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.  రెండు రోజుల నుంచి అక్కడ తేలిక పాటి వర్షం కురుస్తూ ఉండడం గమనార్హం. ఇక ఈ విషయాన్ని ఇటీవలే ప్రముఖ వ్యాఖ్యాత హర్ష బోగ్లే తన సోషల్ మీడియా ఖాతాలో తెలిపారు.


ఈ క్రమంలోనే ఇక ఇలా చిరుజల్లులు కురుస్తున్న కారణంగా టీమిండియా  తమ ప్రాక్టీస్ సెషన్ రద్దు చేసుకొని హోటల్ గదికే పరిమితం అయ్యింది అన్నది తెలుస్తుంది.. ప్రస్తుతం గ్రూప్ 2 లో రెండవ స్థానంలో కొనసాగుతుంది టీమిండియా. ఇక ఎలాంటి సమీకరణాలు లేకుండా నేరుగా భారత్ సెమిస్ లో అడుగు పెట్టాలంటే మిగతా రెండు మ్యాచ్లలో తప్పక గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ దురదృష్టవశాత్తు బంగ్లాదేశ్ మ్యాచ్ రద్దు అయితే మాత్రం ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది అని చెప్పాలి. ఇక అప్పుడు అయిదు పాయింట్లతో రెండవ స్థానంలో కొనసాగుతుంది టీమిండియా.. అప్పుడు జింబాబ్వే తో జరగబోయే మ్యాచ్ లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. దీంతో టీమిండియా ఖాతాలో ఏడు పాయింట్లు వస్తాయి.. ఒకవేళ పాకిస్తాన్ వరుసగా రెండు మ్యాచ్లో గెలిచిన ఇంటి ముఖం పట్టక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: