తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతో మంది దర్శకులు వచ్చారు వెళ్ళారు. ఎంతో మందికి ఈ కళామతల్లి జీవితాన్ని ఇచ్చింది. కొంత మంది కేవలం తమ స్వార్థం మాత్రమే చూసుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగడం మనము చూశాము. కానీ అతి కొద్ది మంది మాత్రమే ఎంతో మందికి జీవితాన్ని ప్రసాదించారు. అటువంటి వారిలో ఒకరే దర్శకరత్న కీర్తి శేశులు దాసరి నారాయణరావు. ఒక పల్లెటూరు నుండి వచ్చిన దాసరి తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేశాడు. ఈయన దర్శకుడే కాకుండా నిర్మాత, రచయిత మరియు నటుడిగా కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. దాసరి ఎక్కువ చిత్రాలకు డైరెక్షన్ చేసి రికార్డ్ సృష్టించాడు. తన సినిమా కెరీర్ లో మొత్తం 150 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఘనత దాసరిది. ఒక నిర్మాతగా 53 సినిమాలను నిర్మించిన ఘనత దాసరికి దక్కింది.

ఈయనకు ఉన్న అభిమానులు వేరే లెవెల్ అని చెప్పాలి. మామూలుగానే ఆ రోజుల్లో సినిమా తరాలకు ఉన్న విలువ వేరే, వారికి అభిమానులు ఒక స్థాయిలో ఉంటారు. అప్పుడు దాసరికి మొత్తం 18,000 వేల అభిమాన సంఘాలు ఉండేవని తెలుస్తోంది. దీనిని బట్టి ప్రేక్షకులు దాసరిని ఎంతలా అభిమానించేవారు అనేది స్పష్టంగా అర్థమవుతోంది. దాసరి తీసిన సినిమాల్లో ముఖ్యంగా సామాజిక అంశాలు ఉండేలా ప్లాన్ చేసేవారు. దాసరి సినిమా నుండి ఒక సాధారణ ప్రేక్షకుడిగా సినిమాలో లీనం అయ్యేలా చేయడంలో సక్సెస్ అయ్యేవాడు. సినిమా చూస్తున్నంత సేపు తనకు తెలిసిన కథలా అనిపించేలా కథను తీసుకునేవాడు. సామాజిక విలువలు, బాధ్యతలను తన సినిమాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో దాసరి సక్సెస్ అయ్యాడు అని చెప్పాలి.

ఇలా తన సినిమా జీవితంలో ఎన్నో గుర్తింపులు, పొగడ్తలు, పురస్కారాలు, సన్మానాలు, అవార్డులు తన ప్రతిభకు దాసోహం అయ్యాయి. అలా ఒకరోజు దాసరి ఆరోగ్యం బాగా క్షీణించింది. డాక్టర్స్ సైతం ఇక ఆయన బ్రతికేది కొన్ని రోజులే అని తేల్చేశారు. ఎంతో మంది డైరెక్టర్స్, హీరోలు, నటీనటులు ఆయన కోసం  కన్నీరు పెట్టుకున్నారు. అయినా ఎవరి ప్రార్ధన ఫలించలేదు 2017 మే 30 వ తేదీన అనంత లోకాలకు అందరినీ వదిలి తరలి వెళ్ళిపోయాడు దాసరి.

మరింత సమాచారం తెలుసుకోండి: