పండితులు డిసెంబర్ 26వ తేదీన మూల నక్షత్రం, ధనుస్సు రాశిలో కంకణ సూర్యగ్రహణం ఏర్పడుతుందని చెబుతున్నారు. శాస్త్రవేత్తలు గురువారం రోజు ఉదయం 8 గంటలకు గ్రహణం ప్రారంభమవుతుందని 11.10 గంటల వరకు గ్రహణం కొనసాగుతుందని ప్రకటన చేశారు. ఈ సంవత్సరంలో ఇదే చిట్టచివరి, మూడవ సూర్య గ్రహణం. మరో 16 సంవత్సరాల తరువాత మాత్రమే ఇలాంటి సంపూర్ణ సూర్యగ్రహణం సంభవిస్తుంది. 
 
పండితులు ధనుస్సు రాశి వారు, కన్య రాశి వారు, వృషభ రాశి వారు గ్రహణాన్ని చూడకపోవటం మంచిదని చెబుతున్నారు. ఈ గ్రహణ ప్రభావం మిగతా రాశుల వారికి మాత్రం పెద్దగా ఉండదని సమాచారం. పండితులు గ్రహణం పూర్తయిన తరువాత అన్ని రాశుల వారు తలస్నానం చేసి ఇష్ట దైవం ముందు కూర్చుని క్రింది స్తోత్రాన్ని చదివితే గ్రహణ దోష ప్రభావం తొలిగిపోతుందని చెబుతున్నారు.

 

నవగ్రహపీడాహరస్తోత్రమ్
గ్రహాణామాదిరాదిత్యో లోకరక్షణకారకః ।
విషమస్థాన సంభూతాం పీడాం హరతు మే రవిః ॥ 1॥ 


రోహిణీశః సుధామూర్తిః సుధాగాత్రః సుధాశనః ।
విషమస్థాన సంభూతాం పీడాం హరతు మే విధుః ॥ 2॥ 


భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్ సదా
వృష్టికృద్వృష్టిహర్తా చ పీడాం హరతు మే కుజః ॥ 3॥ 


ఉత్పాతరూపో జగతాం చన్ద్రపుత్రో మహాద్యుతిః ।
సూర్యప్రియకరో విద్వాన్ పీడాం హరతు మే బుధః ॥ 4॥ 


దేవమన్త్రీ విశాలాక్షః సదా లోకహితే రతః ।
అనేకశిష్యసమ్పూర్ణః పీడాం హరతు మే గురుః ॥ 5॥ 


దైత్యమన్త్రీ గురుస్తేషాం ప్రాణదశ్చ మహామతిః ।
ప్రభుస్తారాగ్రహాణాం చ పీడాం హరతు మే భృగుః ॥ 6॥ 


సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః ।
మన్దచారః ప్రసన్నాత్మా పీడాం హరతు మే శనిః ॥ 7॥ 


మహాశిరా మహావక్త్రో దీర్ఘదంష్ట్రో మహాబలః ।
అతనుశ్చోర్ధ్వకేశశ్చ పీడాం హరతు మే శిఖీ ॥8॥ 


అనేకరూపవర్ణైశ్చ శతశోఽథ సహస్రశః ।
ఉత్పాతరూపో జగతాం పీడాం హరతు మే తమః ॥9॥

మరింత సమాచారం తెలుసుకోండి: