కార్తీక మాసం అంటేనే శివ పార్వతులకు ప్రీతి కరమైన మాసం. ఈ నెలలో పరమశివుని భక్తులంతా ఎంతో నియమ నిష్ఠలతో స్వామిని కొలుస్తారు. తమ కోరికలను ఆయనతో చెప్పుకుంటారు. ఈ మాసంలో ఒక్కొరోజుకు ఒక్కో ప్రత్యేకత ఉండడం గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ మాసంలో కొంతమంది శివ మాల ధరించి భక్తి శ్రద్దలతో ఆయననే ఆరాధిస్తూ ఉంటారు. ఈ నెల రోజుల పాటు శివుని దేవాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసి పోతాయి.

శివును పూజ చేయడానికి ఎన్నో మంత్రాలు మరియు పూజ విధానాలు ఉన్న వేటిల్లవే ప్రత్యేకం. అయితే లింగాష్టకం ను అనునయిస్తూ శివుడ్ని స్తుతించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే ఈ లింగాష్టకం లో ఏమి ఉంటుందో...దీనివలన శివునికి కలిగే ఆనందం ఏమిటో తెలుసుకోవాలనుందో అయితే కింద ఇచ్చిన శివుని లింగాష్టకం ను ఒకసారి చదవండి. మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది.  

1. బ్రహ్మమురారిసురార్చిత లింగం – నిర్మలభాసితశోభితలింగం |
జన్మజదు:ఖవినాశకలింగం – తత్ప్రణమామి సదాశివలింగమ్‌.
2. దేవమునిప్రవరార్చితలింగం – కామదహన కరుణాకరలింగం |
రావణదర్పవినాశకలింగం – తత్ప్రణమామి సదాశివలింగమ్‌.
3. సర్వసుగంధి సులేపితలింగం – బుద్దివివర్ధనకారణలింగం |
సిద్దసురాసురవందిత లింగం – త త్ప్రణమామి సదాశివలింగమ్‌
4. కనకమహామణి భూషితలింగం – ఫణిపతివేష్ఠితశోభితలింగం |
దక్షసుయజ్ఞవినాశనలింగం – తత్ప్రణమామి సదా శివలింగమ్‌.
5. కుంకుమచందనలేపితలింగం – పంకజహారసుశోభితలింగం |
సంచిత పాపవినాశనలింగం – తత్ప్రణమామి సదాశివలింగమ్‌.
6. దేవగణార్చితసేవితలింగం – భావైర్భక్తిభి రేవ చ లింగం |
దినకరకోటి ప్రభాకరలింగం – తత్ప్రణమామి సదాశివలింగ మ్‌.
7. అష్టదళోపరివేష్టితలింగం – సర్వసముద్భవకారణలింగం |
అష్టదరిద్రవినాశనలింగం – తత్ప్రణమామి సదాశివలింగమ్‌.
8. సురగురు సురవరపూజితలింగం – సురవరపుష్పసదార్చితలింగం |
పరమపరం పరమాత్మకలింగం – తత్ప్రణమామి సదాశివలింగమ్‌.
లింగాష్టక మిదం పుణ్యం – య:పఠే చ్ఛివసన్నిధౌ
శివలోక మవాప్నోతి – శివేన సహ మోదతే.

పై విధంగా ప్రతిరోజు శివుని ఎదుట పూజిస్తే మీరు అనుకున్నవి సిద్ధిస్తాయి. అంతేకాకుండా మీకు వేయి జన్మల పుణ్యం లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: