
ఇంతకీ ఆ దేవాలయం ఎక్కడ ఉంది అంటే. మధ్యప్రదేశ్ లోని సాజాపూర్ జిల్లా కాలీసింద్ లోని నది ఒడ్డున ఈ ఆలయం నిర్మించబడి ఉంది. ఈ గుడిలో కళ్లకు కనిపించే ఎన్నో వింతలు భక్తులకు కనువిందు చేస్తూ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఈ గుడిలోని దీపం నెయ్యితోనో లేదా నూనె తోనో కాకుండా నీటితోనే వెలుగుతుంది. అంతే కాకుండా ఐదేళ్ల నుంచి ఆ దీపం కొండెక్కకుండా వెలుగుతూనే ఉంది. ఈ ప్రతిష్టాత్మకమైన దేవాలయం నదీ తీరంలో ఉండడం చేత వర్షకాలం వచ్చిందంటే పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. అందుకే వర్షాకాలమంతా ఈ ఆలయాన్ని మూసి ఉంచుతారు.
వర్షాలు తగ్గి నీటి మట్టం తగ్గిన తర్వాత తిరిగి మళ్లీ నవరాత్రులకే ఈ ఆలయాన్ని తెరుస్తారు. కానీ ఆ దేవాలయంలో దీపం మాత్రం అప్పటి కూడా ఆరక పోవడం గమనార్హం. ఇప్పటికీ ఈ వింతను ఎవరూ చేధించలేక పోయారు. ఇది ఒక దైవ సృష్టిగా ఆలయం యొక్క మహిమగా భక్తులు నమ్ముతారు. ఈ ఆలయం వీక్షకులకు కూడా ఒక చూడ చక్కని ప్రదేశం. చుట్టూ ఎంతో అందమైన పరిసరాలతో భక్తులకు కనువిందు చేస్తోంది ఈ ఆలయం. వీలైతే కరోనా తగ్గిన తరువాత మీరు కూడా వెళ్లి చూసి తరించండి.