శ్రావణమాసం అనగానే ప్రతి ఒక్కరూ అత్యంత పవిత్రంగా భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు అలాగే మంగళవారాలు చాలా ప్రత్యేకమైనవి. శుక్రవారాల్లో ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి కటాక్షం పొందడానికి వ్రతాలు చేస్తే, మంగళవారాలు గౌరీ మాత అనుగ్రహం పొందాలి అని నోము నోస్తూ ఉంటారు. అంటే కేవలం శ్రావణమాసంలో వచ్చే మంగళ,  శుక్రవారాలను మాత్రమే  పవిత్రంగా భావించడమే కాకుండా ప్రతి వారం కూడా ఒక పవిత్రమైన దినంగా మనం భావించడం  వల్ల ఇంట్లో సుఖ సంపదలు, ఆయురారోగ్యాలు అన్ని వేళల కుటుంబంతో ఉంటాయని పెద్దల విశ్వాసం.అయితే మనం ఈ శ్రావణ మాసంలో ప్రతి రోజూ కూడా ఒక పవిత్రంగా భావించి, ఆ రోజున ఏ దేవుడికి పూజ చేస్తామో, ఆ దేవుడి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. సాధారణంగా బుధవారం అనగానే ఆదిదేవుడు అయిన మహా గణపతికి పూజ చేయాలి అనేది గుర్తుకు వస్తుంది. అయితే ఏ దేవుడికి పూజ చేయాలి అనుకున్నా సరే మొదట మహాగణపతికి పూజను అందించిన తర్వాతనే, మిగతా వారికి పూజ చేయడం ఆనవాయితీ.. అయితే ఇంతటి పవిత్రమైన రోజున కూడా కొన్ని తెలియని తప్పులు చేస్తున్నారు. అయితే బుధవారం నాడు ముఖ్యంగా శ్రావణ బుధవారంలో చేయకూడని పనులు ఏమిటి..? ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముఖ్యంగా ఇంట్లో ఉన్న ఆడవాళ్లను ఏ విధంగా కూడా అవమానించ కూడదు. గణపతి పూజ రోజున అమ్మాయిలకు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమయాలలో అమ్మాయిలను ఏ విధంగా కూడా కించపరచకుండా జాగ్రత్తపడాలి.  అనుకోని కారణాల చేత ఆమెను ఏదైనా అనవలసి వస్తే , ఆ తర్వాత ఆమెను సంతోషపెట్టడానికి ఆమెకు కావలసినది ఇవ్వడమే శ్రేయస్కరం.
ఎవరైనా మనకు దారిలో హిజ్రాలు ఎదురైనప్పుడు ,వారు అడగకుండానే డబ్బును వారికి దానంగా ఇవ్వాలి.

అంతే కాకుండా ఈ శ్రావణ బుధవారం రోజున అమ్మవారికి నైవేద్యంగా పెట్టే ఖీర్ కోసం పాలను అసలు మరిగించరాదు.. అంతేకాకుండా ఈ పాలను ఉపయోగించి తీపి పదార్థాలను కూడా తయారు చేయడం ఇంటికి శుభం కాదు. అంతేకాకుండా పచ్చి ధనియాలు,  పాలకూర, ఆవాలు ,పచ్చిమిరపకాయలు, జామపండ్లు, బొప్పాయ వంటి పండ్లను కూడా కొనుగోలు చేయకుండా జాగ్రత్తపడాలి. అంతేకాకుండా మగవారు వారి అత్తవారింటికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి.

కొత్త వస్తువులను ఇంటికి తీసుకు రావడం వంటివి చేయకూడదు..

చూశారు కదా..! ఇలాంటివి పాటించడంవల్ల శ్రావణ బుధవారం మహా గణపతి  ఆశీస్సులు మనకు అంది, మనం చేసే పనిలో విఘ్నాలు తగలకుండా .. అన్నీ శుభం కలిగేలా మహాగణపతి చూసుకుంటారు.. అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: