మనం ఏ శుభకార్యం చేసినా పూజా మందిరానికి వెళ్లినా మొదటగా పూజించాల్సింది  వినాయకుడిని.. ఈయనను ఆరాధిస్తే ఎలాంటి విజ్ఞాలైనా తొలగిపోయి మనం చేసే పని సుఖాంతం నమ్ముతారు. అలాంటి విజ్ఞేశ్వరున్ని మన పూజా మందిరంలో ఏ స్థానంలో పెట్టాలి అనేది తప్పనిసరిగా చూసుకోవాలి. వినాయకుడు ఉండే స్థానాన్ని బట్టే మన వాస్తు అనేది సెట్ అవుతుందట. మరి ఏ స్థానంలో వినాయకుడి ఫోటో ప్రతిమ ఉండాలో ఇప్పుడు చూద్దాం.. ముఖ్యంగా పూజా మందిరాన్ని ఏర్పాటు చేయడానికి ఉత్తమమైనటువంటి స్థానం ఈశాన్య మూల.. ఇది అత్యంత పవిత్రమైనది.. ఒకవేళ ఈ మూలన సాధ్యం కాకపోతే తూర్పు లేదా ఉత్తర గోడన అమర్చుకోవచ్చు.. అయితే ఈ పూజా మందిరాల్లో లక్ష్మీదేవి ఉండే స్థానానికి కుడివైపున గణేశుడి స్థానం ఉంటే మంచిదని వాస్తు నిపుణులు అంటున్నారు..

 ఇలా ఉండడం వల్ల ఎలాంటి అడ్డంకులు ఉన్నా వినాయకుడిని ఉంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనకు డైరెక్ట్ గా కలుగుతుందని తెలియజేస్తున్నారు. వినాయకుడు అడ్డంకులను తొలగించిన తర్వాతే లక్ష్మీదేవి సంపదను శ్రేయస్సును తీసుకువస్తుంది.. కాబట్టి లక్ష్మీదేవికి కుడివైపున వినాయకుడి ప్రతిమ పెట్టాలని అంటున్నారు. అంతేకాకుండా మీరు పూజ చేసే సమయంలో విగ్రహాలు తూర్పుకు ఎదురుగా ఉంటే మీరు పడమరకు ఎదురుగా నిలబడి పూజ చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు దేవతల అనుగ్రహం కలిగి ఆరోగ్యం సంపద కలుగుతుందని వాస్తు నిపుణులు అంటున్నారు.

 అంతేకాదు పూజ ప్రారంభించే ముందుగా వినాయకుడికి ఏదైనా సమర్పించిన తర్వాతే మిగతా దేవుళ్లను పూజిస్తే అన్ని శుభాలే కలుగుతాయి అని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా మీరు ఉంచే దేవతా ప్రతిమలను తప్పనిసరిగా ఎత్తు ప్రాంతంలో ఉంచాలని ఆ చుట్టుపక్కల బాత్రూం లేదంటే బెడ్ రూమ్ లాంటివి ఉండకుండా చూసుకోవడం చాలా మంచిదని అంటున్నారు. అంతే కాదు పూజ చేసే మందిరాలు ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి రోజు ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసుకొని ధూప దీప నైవేద్యాలు అందిస్తే కుటుంబం హ్యాపీగా జీవించడమే కాకుండా, సకల భోగాలు కలుగుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు  తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: