ప్రస్తుతం టీమిండియా పురుషుల జట్టు ఎంతో అద్భుతంగా రాణిస్తూ దూసుకుపోతుంది. ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యాన్ని సాధిస్తూ తిరుగులేదు అని నిరూపిస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే పురుషుల జట్టుకు తాము ఎక్కడ తక్కువ కాదు అని నిరూపిస్తూ అద్భుతమైన ప్రదర్శన తో ప్రేక్షకుల చూపులు తమవైపు తిప్పుకుంటుంది టీమిండియా మహిళల జట్టు. ఇటీవలికాలంలో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ వరుసగా విజయాలు సాధిస్తోంది అన్న విషయం తెలిసిందే. టీమిండియా సీనియర్ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్పుత్
 అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత వన్డే జట్టు కెప్టెన్సీ  పగ్గాలు  హర్మన్ ప్రీత్ కౌర్ చేతికి వచ్చాయి.


 ఈ క్రమంలో ని హర్మన్ ప్రీత్  అటు టీమిండియాను ఎలా ముందుకు నడిపించపోతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఇకపోతే ప్రస్తుతం టీమ్ ఇండియా శ్రీలంక మధ్య టి20 సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక 3 టి20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇప్పటికే రెండు టీ-20 మ్యాచ్లు ముగిసాయి. రెండు మ్యాచ్ లలో  కూడా టీమిండియా మహిళల జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసి ఘన విజయాలను అందుకుంది. ఇలా మూడు మ్యాచ్ ల టి-20 సిరీస్ లో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది భారత మహిళల జట్టు. దీంతో అందరూ కూడా ఇండియా ప్రదర్శనపై ప్రస్తుతం ప్రశంసలు కురిపిస్తున్నారు అని చెప్పాలి.


 ఇకపోతే ఇప్పటికే సిరీస్ గెలిచి
 సత్తా చాటిన టీమిండియా ఇక ఇప్పుడు శ్రీలంకపై పూర్తి ఆధిపత్యం సాధించి వైట్ వాష్ చేయడం పై కన్నేసింది అనేది తెలుస్తుంది. ఈ క్రమంలోనే దీనికోసం పదునైన వ్యూహాలతో బరిలోకి దిగేందుకు సిద్ధం అవుతుంది హర్మన్ ప్రీత్ సేన. అదే సమయంలో అటు శ్రీలంక జట్టు చివరి మ్యాచ్లో గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తూ ఉండడం గమనార్హం. అయితే ఇటీవలే పాకిస్థాన్ చేతిలో కూడా శ్రీలంక 0- 3 తేడాతో క్లీన్స్వీప్ కి గురి అయింది. అయితే ఇక మూడో మ్యాచ్లో గెలవడానికి భారత బ్యాటింగ్ విభాగం మరింత నిలకడగా రాణించాల్సిన అవసరం ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: