ఇటీవల ఐర్లాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా రెండో విజయాన్ని సాధించి పసికూన ఐర్లాండ్ ను క్లీన్ స్వీప్  చేసింది అన్న విషయం తెలిసిందే. వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించి సత్తా చాటింది. అయితే ఇక రెండవ టీ 20 మ్యాచ్ లో భాగంగా అటు దీపక్ హుడా అదిరిపోయే ప్రదర్శన తో ఆకట్టుకున్నాడు. ఏకంగా ఐర్లాండ్ బౌలర్లపై వీరవిహారం చేస్తూ అదరగొట్టాడు అని చెప్పాలి. సిక్సర్లు ఫోర్ లతో చెలరేగిపోయి కేవలం 57 బంతుల్లో 104 పరుగులు చేసి సూపర్ సెంచరీతో దూసుకుపోయాడు దీపక్ హుడా.


 సరిగ్గా టి20 వరల్డ్ కప్ ముందు దీపక్ హుడా చేస్తున్న ప్రదర్శన మాత్రం ప్రస్తుతం అతనికి టి20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కే లాగే ఉంది అని చెప్పాలి. అయితే ఇటీవలే ఐర్లాండ్  పై జరిగిన రెండో ట్వంటీ-20 మ్యాచ్లో దీపక్ హుడా సెంచరీతో చెలరేగిన నేపథ్యంలో ఇప్పటివరకు టి-20లో భారత్ తరఫున అత్యధిక స్కోరు చేసిన ఆటగాళ్లు ఎవరు అన్న విషయం కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వివరాలు కూడా వైరల్ గా మారిపోతున్నాయ్. ఇలా టి20 లలో భారత్ తరఫున ఎక్కువ పరుగులు చేసి సత్తా చాటిన ఆటగాళ్ళ  వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


 2017 లో రోహిత్ శర్మ శ్రీలంకపై 118 పరుగులు చేయగా ఇదే టి-20లో భారత్ అత్యధిక స్కోర్ కొనసాగుతోంది. ఇక 2018లో వెస్టిండీస్ పై 111 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. 2016 లో వెస్టిండీస్పై 110 పరుగులు చేశాడు కె.ఎల్.రాహుల్. 2015 లో సౌత్ ఆఫ్రికా పై రోహిత్ శర్మ 106 పరుగులు చేశాడు. 2022 లో ఐర్లాండ్ పై దీపక్ హుడా 104 పరుగులు చేశాడు. 2018లో ఇంగ్లాండుపై కె.ఎల్.రాహుల్ 101 పరుగులు చేశాడు. 2010లో సురేష్ రైనా సౌత్ఆఫ్రికాపై 101 పరుగులు చేశాడు. 2018 లో ఇంగ్లాండ్ పై రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. ఇప్పుడు వరకు ఎక్కువ వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాళ్లలో వీరు టాప్ లో కొనసాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: