సాధారణంగా ప్రతి ఆటగాడు ఎంతోమంది దిగ్గజ క్రికెటర్ లు సాధించిన రికార్డును బ్రేక్ చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగుతు ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొంత మంది ఆటగాళ్లు రికార్డులు సాధించడంలో  విజయవంతం అవుతూ ఉంటారు.. ఎంతోమంది దిగ్గజాలు సాధించిన రికార్డులు అలవోకగా బ్రేక్ చేస్తూ ఉంటారు. అయితే ఒక వైపు బౌలర్ కృషితో పాటు రికార్డులు సాధించాలంటే అదృష్టం కూడా కావాలి అని చెప్పాలి. ఇక ఇలాంటి ఒక అద్భుతమైన రికార్డు ని తన ఖాతాలో వేసుకున్నాడు ఆస్ట్రేలియా బౌలర్. టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ జాబితాలో టాప్ టెన్ లిస్టులో చేరిపోయాడు.


 ఆస్ట్రేలియా దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియాన్ ఈ ఘనతను సాధించడం గమనార్హం. ఇక భారత క్రికెట్లో దిగ్గజ బౌలర్ గా  కొనసాగుతున్న కపిల్ దేవ్ ను వెనక్కి నెట్టేశాడు నాధన్ లియోన్. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు శ్రీలంక పర్యటన లో ఉంది అన్న విషయం తెలిసిందే  అయితే ఈ పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్ ఆడుతుంది. ఈ క్రమంలోనే తొలి టెస్టు మ్యాచ్లో నాథన్ లియాన్ అదరగొట్టాడు. ఈ క్రమంలోనే  టెస్టుల్లో కపిల్దేవ్ సాధించిన 434 వికెట్లు సంఖ్యను అధిగమించాడు.  మొదటి టెస్టులో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. తద్వారా  ప్రపంచ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.


 ఇప్పటివరకు 109 టెస్టులు ఆడిన నాథన్ లియాన్ 436 వికెట్లు పడగొట్టాడు అని చెప్పాలి. దీంతో ఇక టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ల జాబితాలో టాప్ టెన్ లో చేరిపోయాడు. ఇక ఈ లిస్టులో ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్లతో  అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు ఎవరు కూడా ఇక ఈ అరుదైన రికార్డును బ్రేక్ చేసేందుకు దగ్గర కూడా లేరు అని చెప్పాలి. ఇక ఈ లిస్టులో అటు నాథన్ లియోన్ తో పాటు జేమ్స్ అండర్సన్, స్టువర్ట్  బ్రాడ్, రవిచంద్రన్ అశ్విన్ కూడా ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: