టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ విషయంలో ఇటీవలే మాజీ ఆటగాడు ప్రజ్ఞాన్ ఓజా చేసిన వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారిపోయాయ్ అన్న విషయం తెలిసిందే. వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ వన్డే ప్రపంచకప్ జట్టులో ఉంటే ఉపయుక్తంగా ఉంటుందని అందుకే బహుశా అతనికి అవకాశాలు వస్తున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశాడు. తనుకు ఓపెనింగ్ జోడిగా శిఖర్ ధావన్ ఇలాంటి  అనుభవజ్ఞులు ఉంటే బాగుంటుందని రోహిత్ శర్మ కోరుకుంటున్నాడు అంటూ ఓజా  కామెంట్స్ చేశాడు. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ మధ్య ఉన్నట్లుగానే రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ మధ్య ఫ్రెండ్షిప్ ఉందని చెప్పుకొచ్చాడు. కాగా ప్రజ్ఞాన్ ఓజా చేసిన వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారిపోయాయ్.


 ఈ క్రమంలోనే ఈ రోజు నుంచి వెస్టిండీస్తో టి20 సిరీస్ ప్రారంభం కాబోతుండగా.. మ్యాచ్ కు ముందు  రోహిత్ శర్మ ప్రజ్ఞాన్ ఓజా వ్యాఖ్యలపై సరదాగా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవునా ఇప్పుడు ప్రజ్ఞాన్ ఓజా కామెంటేటర్గా ఉన్నాడా.. మంచిది.. ఏదేమైనా మనతో కలిసి బ్యాటింగ్ చేస్తున్న ఆటగాడు ఎవరైనా సరే అది శిఖర్ ధావన్  లేదంటే మరొకరు పరస్పర అవగాహనతో మేము ముందుకు వెళ్తాము. అదేసమయంలో స్నేహబంధం కూడా పెంపొందుతుంది అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. మైదానం వెలుపల కూడా ఈ స్నేహబంధం కొనసాగుతోంది.


ఆటగాళ్ళ మధ్య ఇలాంటి స్నేహ బంధం అంటే అటు డ్రెస్సింగ్ రూమ్ లో వాతావరణం కూడా బాగుంటుంది. అయితే జట్టు అవసరాలను బట్టి ప్లేయర్లకు అవకాశం ఇస్తామని.. అంతే తప్ప వారితో ఉన్న అనుబంధం కారణంగా కాదు అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. అయితే రోహిత్ శర్మ ప్రజ్ఞాన్ ఓజా మధ్య కూడా మంచి అనుబంధం ఉంది అన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కూడా ఐపీఎల్లో దక్కన్ ఛార్జర్స్ ముంబై ఇండియన్స్ జట్టు తరపున కలిసి ఆడారు. ఇకపోతే నేటి నుంచి ప్రారంభం కాబోయే ఐదు టీ20 సిరీస్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: