ఫిబ్రవరి 9వ తేదీ నుంచి భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా తో టెస్టు సిరీస్ ఆరంభించబోతుంది ఆతిథ్య భారత జట్టు. ఈ క్రమంలోనే ఈ టెస్ట్ సిరీస్ హోరాహోరీ గా జరగబోతుంది అన్నది తెలుస్తుంది. ఈ సిరీస్ కోసం అభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇరు జట్ల ఆటగాళ్లు కూడా మంచి ఫామ్ లో ఉండడంతో ఇక రెండు జట్లు ఎంతో పటిష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ టెస్టు సిరీస్ నేపథ్యంలో ప్రస్తుతం ఎంతోమంది మాజీ ఆటగాళ్లు కూడా స్పందిస్తూ ఇక తమ రివ్యూలను సోషల్ మీడియా వేదికగా చెప్పేస్తూ ఉన్నారు. అంతేకాదు ఇక ఇరు జట్ల ఆటగాళ్లు ఎలా ఆడాలి అనే విషయంపై సూచనలు సలహాలు ఇస్తూ ఉండటం గమనార్హం.


 ఈ క్రమంలోనే భారత మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ విరాట్ కోహ్లీకి ఒక సలహా ఇచ్చాడు. ఆస్ట్రేలియా స్పిన్నర్లకు అవకాశం ఇవ్వకుండా ఎదురు దాడికి దిగాలి అంటూ సూచించాడు. లేదంటే మొదటికే మోసం వస్తుంది అంటూ అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే వన్డే టీ20 ఫార్మాట్లో సెంచరీ చేసి నిరీక్షణకు తెరదించాడు విరాట్ కోహ్లీ. అయితే టెస్టుల్లో కూడా సెంచరీ చేయాల్సిన అవసరం ఉంది. 2019లో బంగ్లాదేశ్ పై చివరిసారి సెంచరీ చేశాడు. మళ్లీ టెస్ట్ సెంచరీ అందుకోలేకపోయాడు. అయితే గత కొన్ని రోజుల నుంచి స్పిన్నర్ లను ఎదుర్కోవడంలో కోహ్లీ కాస్త తడబడుతున్నట్లు కనిపిస్తోంది.

 ఈ క్రమంలోనే స్పిన్నర్లను ఎదుర్కోవడం పై ఇర్ఫాన్ పఠాన్ అటు విరాట్ కోహ్లీకి సలహా ఇచ్చాడు. ఆస్ట్రేలియా స్పిన్నర్లను డిఫెన్స్ మోడలో కాకుండా అటాకింగ్ మోడ్లో ఎదుర్కోవాలి అంటూ చెప్పాడు. ఇక ఇలా ఆస్ట్రేలియా స్పిన్నర్లను ఎదుర్కోవడం పై ప్రత్యేక ప్రణాళికతో బరిలోకి దిగాలి. ఎందుకంటే కోహ్లీ స్పిన్ లో తడబడుతున్నట్లు కనిపిస్తుంది. నా అభిప్రాయం ప్రకారమైతే లియోన్, అగర్ లపై ఎదురుదాడికి దిగడమే ఉత్తమం అంటూ చెప్పుకొచ్చాడు ఇర్ఫాన్ పఠాన్.

మరింత సమాచారం తెలుసుకోండి: