రవిచంద్రన్ అశ్విన్.. భారత జట్టులో సీనియర్స్ స్పిన్నర్గా కొనసాగుతున్న ఇతని పేరు గత కొంతకాలం నుంచి వార్తల్లో ఎక్కువగా హాట్ టాపిక్ గా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే. దీనికి కారణం ఇక ఆస్ట్రేలియాతో రేపటి నుంచి జరగబోయే నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కావడం గమనార్హం. ఎందుకంటే ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత పర్యటనకు వచ్చి నాలుగు మ్యాచ్లు టెస్ట్ సిరీస్ ఆడుతుంది. అయితే భారత్ లో ఉన్న స్పిన్ పిచ్ లపై ఆస్ట్రేలియా ఎలా రాణించబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా భారత జట్టులో తెలివైన బౌలర్గా అనుభవం గల స్పిన్నర్ గా ఉన్న డేంజరస్ రవిచంద్రన్ అశ్విన్ ను ఆస్ట్రేలియా ఎలా ఎదుర్కోబోతుంది అన్నది హాట్ టాపిక్ గా మారింది.


 టీమిండియాలో ఎంతమంది స్పిన్నర్లు ఉన్నప్పటికీ అటు ఆస్ట్రేలియాకు అసలు సిసలైన సవాల్ విసిరేది మాత్రం కేవలం రవిచంద్రన్ అశ్విన్ మాత్రమే అని ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి. ఇక అశ్విన్ ను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా అతని లాగే బౌలింగ్ చేసే ఒక యువ బౌలర్ను నియమించుకొని మరి ఆస్ట్రేలీయా బ్యాట్స్మెన్లు ప్రాక్టీస్ చేయడానికి సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారిపోయింది. ఇదిలా ఉంటే ఇక నాగపూర్ వేదికగా రేపటి నుంచి ప్రారంభం కాబోయే తొలి టెస్ట్ కు ముందు టీమిండియా వెటరన్  స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను ఒక అరుదైన రికార్డు ఊరిస్తుంది అని చెప్పాలి.


 ఆస్ట్రేలియాతో జరగబోయే తొలి టెస్ట్ మ్యాచ్ లో అశ్విన్ మరో 7 వికెట్లు సాధించాడు అంటే ఆస్ట్రేలియాపై టెస్ట్ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండవ భారత బౌలర్గా నిలుస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే భారత దిగ్గజ స్పిన్నర్ అయిన హర్భజన్ సింగ్ 95 వికెట్ల రికార్డును అశ్విన్ అధిగమిస్తాడు అని చెప్పాలి. ఇప్పటివరకు 18 టెస్టులు ఆడిన అశ్విన్ ఆస్ట్రేలియాపై 89 వికెట్లు సాధించాడు. కాగా ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో 111 వికెట్లతో భారత స్పిన్ దిగజం అనిల్ కుంబ్లే తొలి స్థానంలో ఉన్నాడు. ఇక అశ్విన్ తర్వాత కపిల్ దేవ్ 79, రవీంద్ర జడేజా 63 వికెట్లతో వరుసగా నాలుగు ఐదు స్థానాల్లో ఉన్నారు అని చెప్పాలి. ఇక ఈ సిరీస్లో అశ్విన్ 23 వికెట్లు పడగొడితే అనిల్ కుంబ్లే రికార్డును కూడా బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: