భారత పేస్ గుర్రం జస్ ప్రీత్ బుమ్రా టీమిండియాకు ఎంత కీలకమైన ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  అయితే అలాంటి కీలక ఆటగాడు బుమ్రా గత ఏడాది వెన్నునొప్పి గాయం బారిన పడ్డాడు. ఇలాంటి సమయంలోనే ఇక అతనికి శస్త్ర చికిత్స కూడా జరిగింది. అయితే అతనితోపాటు గాయాల బారిన పడిన ఆటగాళ్లు కోలుకొని జట్టులోకి వచ్చి అదరగొడుతూ ఉంటే.. 8 నెలలు కావస్తున్న జస్ ప్రీత్ బుమ్రా మాత్రం ఇంకా భారత జట్టులో మాత్రం కనిపించడం లేదు అని చెప్పాలి. అయితే ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా జట్టులోకి వస్తాడని అందరూ అనుకున్నారు...


 కానీ అది జరగలేదు. ఆస్ట్రేలియాతో ఇప్పటికే జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్లలో చోటు దక్కించుకోని.. జస్ ప్రీత్ బుమ్రా ఇక జరగబోయే రెండు టెస్ట్ మ్యాచ్ లకు కూడా దూరంగానే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అతనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తూ ఉన్నాయి. జాతీయ జట్టును కాదని ఐపీఎల్ ఆడటం కోసమే ప్రస్తుతం జస్ ప్రీత్ బుమ్రా తన ఫిట్నెస్ను కాపాడుకుంటున్నాడు అని ప్రస్తుతం అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం జాతీయ జట్టు ప్రయోజనాలను తాకట్టు పెట్టడం ఏంటి అంటూ నిలదీస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఐపీఎల్ పై అంత ఇష్టం ఉంటే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి ఐపీఎల్ ఆడుకుంటే అయిపోతుంది కదా అని కొంతమంది సలహాలు ఇస్తున్నారు.


 అటు భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రమేయం లేనిదే గాయం అని ఒక కారణాన్ని చూపిస్తూ జస్ ప్రీత్ బుమ్రా జాతీయ జట్టుకు దూరంగా ఉండగలడా అని మరి కొంతమంది అటు బీసీసీఐ ని కూడా టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇంకొంతమంది విరాట్ కోహ్లీని చూసి సిగ్గుపడాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవల న్యూఢిల్లీ వేదికగా జరిగిన రెండవ టెస్టు మ్యాచ్లో కోహ్లీ ప్రవర్తన ఇక జస్ ప్రీత్ బుమ్రాకు ఉదాహరణగా చూపిస్తూ ఉన్నారు స్టేడియం లో ఉన్న అభిమానులు. అందరూ కూడా ఆర్సీబీ ఆర్సిబి అరుస్తూ ఉంటే.. ఆర్సిబి కాదు ఇండియా అని అరవాలి అంటూ తన జెర్సీ మీద ఉన్న ఇండియా పేరును చూపించాడు కోహ్లీ. ఆ తర్వాత అభిమానులు ఇండియా ఇండియా అని అరుస్తూ ఉంటే వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేశాడు. ఐపీఎల్ ముఖ్యం కాదు టీమ్ ఇండియా ముఖ్యమని చెప్పిన కోహ్లీని చూసి నేర్చుకో అని కొంతమంది అభిమానులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: