ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో ఇటీవల భారత జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో భాగంగా మొదట ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ చేసింది. అయితే శుభారంభం చేసినప్పటికీ ఆ తర్వాత భారత బౌలర్లు విజృంభించడంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ విభాగం మొత్తం పేక మెడల కూలిపోయింది అని చెప్పాలి. 35.4 ఓవర్లలోనే 188 పరుగులు చేసిన ఆస్ట్రేలియా జట్టు ఆల్ అవుట్ అయింది. అయితే టీమిండియా ముందు స్వల్ప టార్గెట్ మాత్రమే ఉండడంతో ఎంతో ఆలవోకగా చేదిస్తుందని అందరూ అనుకున్నారు.


 ఇక మొదటి వన్డే మ్యాచ్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు అని భావించారు. కానీ ఊహించని రీతిలో స్వల్ప టార్గెట్ ను చేదించే క్రమంలో టీమిండియా తడబడింది అని చెప్పాలి. టాప్ ఆర్డర్ మొత్తం తక్కువ పరుగులకే కుప్ప కూలిపోయింది. ఏకంగా 39 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి.. పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది టీమిండియ. అయితే మధ్యలో కెప్టెన్ గా ఉన్న పాండ్యా కాస్త ఆదుకునేందుకు ప్రయత్నించిన.. అతను కూడా అవుట్ కావడంతో టీమిండియా మరింత కష్టాల్లో పడింది అని చెప్పాలి. అయితే ఇలాంటి సమయంలో మొన్నటి నుంచి వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్న కేఎల్ రాహుల్ జట్టును గెలిపించే ఇన్నింగ్స్ ఆడాడు.


 ఏకంగా ఆపద్బాంధవుడు పాత్రను పోషించి జట్టును గెలిపించాడు అని చెప్పాలి. అయితే కేఎల్ రాహుల్ జట్టును గెలిపించినప్పటికీ అటు రవీంద్ర జడేజా లేకపోతే మాత్రం ఇక టీమిండియా గెలిచేది కాదు అని చెప్పాలి. ఎందుకంటే అతను లేకపోతే రాహుల్ అంత మంచి ఇన్నింగ్స్ ఆడేవాడు కాదు. 69 బంతుల్లో ఐదు ఫోర్ల సహాయంతో 45 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు రవీంద్ర జడేజా. ఇక అంతకు ముందు బౌలింగ్లో కూడా మంచి ప్రదర్శన చేశాడు. దీంతో అటు కేఎల్ రాహుల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు మాత్రం రవీంద్ర జడేజాకే వరించింది అని చెప్పాలి. అయితే కేఎల్ రాహుల్ మ్యాచ్ గెలిపించి ఉండవచ్చు.. కానీ నీ ఇన్నింగ్స్ ను మాత్రం అసలు మరువలేము అంటూ రవీంద్ర జడేజాపై భారత క్రికెట్ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: