ఇలా హోమ్ గ్రౌండ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు స్వల్ప టార్గెట్ ను చేదించలేక ఓడిపోవడంపై అటు అభిమానులు అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే మార్గరం కెప్టెన్ గా మారిన తర్వాత అయినా సన్రైజర్స్ ఫేట్ మారుతుంది అనుకుంటే మాత్రం అదంతా ఎక్కడ కనిపించడం లేదు. ఈ క్రమంలోనే ఇక ఢిల్లీతో మ్యాచ్లో ఓటమి అనంతరం మాట్లాడిన సన్రైజర్స్ కెప్టెన్ మార్కరమ్.. జట్టులో గెలవాలని తపన లోపించింది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ అటు బ్యాటింగ్ మాత్రం ఓటమికి కారణమైందంటూ చెప్పుకొచ్చాడు.
చెత్త బ్యాటింగ్.. ఒక్కరిలో కూడా గెలవాలని కసి లేకపోవడమే మా ఓటమికి కారణమైంది అంటూ తెలిపాడు. మేము స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసే విషయంపై మరింత ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. మా తప్పిదాలను సరిదిద్దుకోవాలి. బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడాలనుకుంటున్నాం. కానీ ఆ దిశగా బ్యాటింగ్ చేయలేకపోయాం. గెలవాలనే ఇంటెంట్ మా జట్టు ఆటగాళ్లలో ఎక్కడ కనిపించలేదు. అందుకే గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయాం. నిజాయితీగా మాట్లాడటం నాకు ఇష్టం. కుర్రాళ్లను ఉత్సాహపరచడాన్ని నేను ఆస్వాదిస్తా.. మా జట్టు బ్యాటింగ్ విభాగం మరింత కష్టపడాలి. బౌలర్లు మాత్రం అద్భుతం అంటూ మార్కరమ్ చెప్పుకొచ్చాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి