రోడ్డు నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ పోలీసులు ఎంతలా హితబోధ చేసిన వాహనదారులు తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఇక నిబంధనలు పాటించకుండానే రహదారుల పైకి వస్తూ నిర్లక్ష్యమైన ధోరణితో ఇతరులను ఇబ్బంది పెట్టడం చేస్తూ ఉంటారూ. అయితే రోడ్డునిబంధనలు పాటించకపోగా ఏకంగా విన్యాసాలు చేసేందుకు ప్రయత్నిస్తూ చివరికి ప్రమాదాలకు కారకులుగా మారిపోతూ ఉంటారు అని చెప్పాలి. వాహనాన్ని బయటికి తెచ్చే ముందు తప్పనిసరిగా హెల్మెట్ తో పాటు సరైన ధ్రువపత్రాలు వెంట తెచ్చుకుంటే ఎలాంటి సమస్య ఉండదు.


 కానీ కొంతమంది మాత్రం ఇవేవీ లేకుండానే వాహనాలను నడుపుతూ ఉంటారు. అయితే ఎక్కడైనా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు అంటే వారికి చిక్కకుండా ఉండేందుకు నానా తంటాలు పడుతూ ఉంటారు అని చెప్పాలి. కొన్ని కొన్ని సార్లు ఇలా పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో చివరికి ప్రమాదాల బారిన పడటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక యువకుడు ఇలాగే పోలీసుల చలానా నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించాడు. కానీ అక్కడ ఊహించని ఘటన జరిగింది. ఏకంగా బైక్ వెనకాల ఉన్న ప్రియురాలు ఒక్కసారిగా రోడ్డు మీద పడిపోయింది. అయినా పట్టించుకోకుండా సదరు యువకుడు బైక్ తో పారిపోయాడు.


 ఇక ఈ వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. ఓ యువకుడు తన ప్రేమికురాలతో బండిపై ప్రయాణిస్తున్నాడు. ఇంతలో ట్రాఫిక్ సిగ్నల్ వచ్చింది. అయితే యువకుడు బండిని నెమ్మదిగా స్లో చేసాడు. అంతలోనే అక్కడికి ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చాడు. అతన్ని చూడగానే ఎక్కడా చలానా వేస్తాడేమో అనే భయం యువకుడిలో కనిపించింది. ఈ క్రమంలోనే తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఒకసారిగా బండి స్పీడ్ పెంచేసి సిగ్నల్ దాటపోయాడు. కానీ వెనకాల ఉన్న యువతి అప్రమత్తంగా లేకపోవడంతో అమాంతం కింద పడిపోయింది. ఆమెను పట్టించుకోకుండానే ఆ యువకుడు తప్పించుకున్నాడు. చివరికి కానిస్టేబుల్ యువతిని పైనకి లేపి ఆసుపత్రికి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: