ఈ ఏడాది క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా పండుగ వాతావరణమే ఉండబోతుంది అని చెప్పాలి. ఎందుకంటే రెండు మెగా టోర్నిలు ప్రేక్షకులందరికీ కూడా ఎంటర్టైన్ మెంట్ పంచేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది. అయితే ఈ వరల్డ్ కప్ అక్టోబర్ 5వ తేదీ నుంచి కూడా ప్రారంభం కాబోతుంది అని చెప్పాలి. ఇక అంతకుముందే మరో టోర్ని క్రికెట్ లవర్స్ ని ఎంటర్టైన్ చేయబోతుంది. అదే ఆసియా కప్. పాకిస్తాన్, శ్రీలంక వేదికలలో హైబ్రిడ్ పద్ధతిలో ఇక ఈ ఆసియా కప్ జరగబోతుంది.


 ఆసియా కప్ లో భాగంగా ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ ఎదురుచూసే ఇండియా, పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్ కూడా జరగబోతుంది అని చెప్పాలి. అయితే ఇక ఆగస్టు 30వ తేదీ నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుండగా.. ఇక ఈ టోర్నీలో పాల్గొనబోయే అన్ని టీమ్స్ కూడా ఆసియా కప్ కోసం బరిలోకి దిగబోయే జట్టు వివరాలను ప్రకటిస్తూ ఉన్నాయి. కానీ ఇప్పటివరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి మాత్రం ఇక జట్టు వివరాలను ప్రకటించలేదు అని చెప్పాలి. దీంతో ఆసియా కప్ టీంలో చోటు దక్కించుకోబోయే ఆటగాళ్ళు ఎవరు అనే విషయంపై ఎన్నో ఊహాగానాలు కూడా తెరమీదకి వస్తూ ఉన్నాయి.


 ఈ క్రమంలోనే ఈనెల 30వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే ఆసియా కప్ కి ఏ టీం అయితే బాగుంటుంది అనే విషయంపై స్టార్ స్పోర్ట్స్ ఎక్స్పర్ట్ ప్యానెల్ ఒక జట్టును ప్రకటించింది. ఇక ఈ టీం కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది అని చెప్పాలి. ఏకంగా 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఇందులో ఇటీవల కాలంలో టీమ్ ఇండియాలో చోటు దక్కించుకొని అదరగొడుతున్న తెలుగు తేజం తిలక్ వర్మకు చోటు కల్పించారు. అయితే ఇటీవల గాయాలనుంచి కోలుకున్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ని మాత్రం పక్కన పెట్టారు. ఇక బుమ్రాకి చోటు కల్పించారు. అయితే నలుగురు స్పిన్నర్లకు జట్టులో చోటు ఇవ్వడం గమనార్హం. ఇకపోతే ఈనెల 20వ తేదీన అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆసియా కప్ కోసం భారత జట్టును ప్రకటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: