సాధారణంగా ప్రపంచ క్రికెట్ లో ఒక ఆటగాడు సాధించిన అరుదైన రికార్డును మరో ఆటగాడు బద్దలు కొట్టాడు అంటే చాలు అది హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. అలాంటిది ఇక నేటితరం క్రికెటర్లకు సాధ్యం కాని రికార్డును.. ఎవరు కనీసం దరిదాపుల్లో కూడా లేని రికార్డును ఒక ఆటగాడు బద్దలు కొట్టాడు అంటే ఆ విషయం గురించి క్రికెట్ ప్రపంచం మొత్తం చర్చించుకుంటుంది అన్న విషయం తెలిసిందే. అంతేకాదు గతంలో ఆ రికార్డు సాధించిన ఆటగాడి గురించి ఇక ప్రస్తుతం ఆ రికార్డును బద్దలు కొట్టిన ప్లేయర్ తో పోల్చి చూడడం మొదలు పెడుతూ ఉంటారు క్రికెట్ ప్రేక్షకులు.


 దీంతో ఇద్దరిలో ఎవరు గొప్ప అనే చర్చ కూడా జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ప్రస్తుతం భారత క్రికెట్ లో ఇలాంటి చేర్చే తెరమీదకి వచ్చింది. విరాట్ కోహ్లీ ఇటీవలే వరల్డ్ కప్ లో భాగంగా సౌత్ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్లో సూపర్ సెంచరీ తో చెలరేగిపోయాడు. ఈ క్రమంలోనే క్రికెటర్లలో ఎవ్వరు కూడా దరిదాపుల్లో లేని సచిన్ 49 వన్డే సెంచరీల రికార్డును సమం చేశాడు. కోహ్లీ దూకుడు చూస్తూ ఉంటే ఇక ఈ రికార్డును బద్దలు కొట్టేలాగే కనిపిస్తున్నాడు. దీంతో సచిన్ విరాట్ కోహ్లీలలో ఎవరు గొప్ప అనే చర్చ తెరమీదకి వచ్చింది అని చెప్పాలి.



 అయితే దాదాపు రెండు దశాబ్దాల పాటు భారత క్రికెట్కు సేవలు అందించాడు. ఇక ఇప్పుడు నేటితరం లెజెండ్ గా మారిపోయాడు. దీంతో ఇద్దరు అగ్ర ప్లేయర్లలో ఎవరు గొప్ప అంటే చెప్పడం కష్టమే. అయితే సచిన్ నాటి రోజులలో పోల్చి చూస్తే క్రికెట్లో చాలా నిబంధనలు మారాయి. అప్పుడు కాస్త కఠిన పరిస్థితులు ఉండేవి. అప్పటి బౌలర్లు కూడా చాలా కఠినంగానే ఉండేవారు. అయితే అప్పుడు సచిన్ ఒక్కడే జట్టు భారాన్ని మోసాడు అనే పేరు కూడా ఉంది. కాగా సచిన్ 452 ఇన్నింగ్స్ లలో 49 సెంచరీలు చేస్తే.. కోహ్లీ 277 ఇన్నింగ్స్ లోనే ఈ రికార్డును సమం చేయడం గమనార్హం. దీంతో ఈ ఇద్దరినీ లెజెండ్స్ అని ప్రేమగా తెలుసుకోవడం తప్ప ఎవరూ గొప్ప అని  పోల్చడం మాత్రం సరైనది కాదు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: