
ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఎంతోమంది భారత మాజీ ఆటగాళ్లు టీమిండియా కు కోచ్ లుగా వ్యవహరించిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇలా భారత జట్టుకు కోచ్గా వ్యవహరించే అవకాశం వస్తే ఏ మాజీ ఆటగాడు అయినా సరే వదులుకోవడానికి అస్సలు ఇష్టపడడు. ఎందుకంటే ఒకప్పుడు ఏ భారత జట్టులో అయితే క్రికెట్ ఆడి జట్టుకు విజయాలను అందించారో.. ఇక ఇప్పుడు అదే భారత జట్టుకు పనిచేస్తూ ఇక విజయం కోసం పోరాటం చేసే అవకాశం ఉంటుంది. ఏకంగా కోచ్గా ఆటగాళ్లకు అత్యుత్తమ ప్లేయర్లుగా తీర్చిదిద్దే ఛాన్స్ ఉంటుంది.
దీంతో భారత జట్టుకు కోచ్ గా ఉండే అవకాశం వస్తే ఎవ్వరూ కూడా నో చెప్పరు. కానీ భారత మాజీ ఆటగాడు ఆశిష్ నెహ్ర మాత్రం గతంలో ఇలా కోచ్ పదవిని ఆఫర్ చేస్తే నిర్మొహమాటంగా నో చెప్పేసాడు. టి20 ఫార్మాట్లో కోచ్గా ఉండడానికి అసలు అంగీకరించలేదు. అయితే ఐపీఎల్లో గుజరాత్ టీం తో 2025 వరకు కాంట్రాక్టు ఉండడం.. ఇక ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సి వస్తుంది అనే కారణాలతోనే ఆశిష్ నెహ్ర ఇలా కోచ్ పదవిని నిరాకరించాడు అన్నది తెలుస్తుంది . ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో టీమిండియాకు కోచ్ అవ్వాలనే ఉద్దేశం ఆయనకు లేదని.. కానీ భవిష్యత్తులో ఆశిష్ నెహ్రను కోచ్గా చూసే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు.