
అయితే నేటి తరంలో ఇలా సచిన్ టెండూల్కర్ తో సరితూగే ఆటగాడు ఎవరైనా ఉన్నారు అంటే అతను కేవలం ఒక విరాట్ కోహ్లీ మాత్రమే అని కొంతమంది మాజీలు చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పటివరకు సచిన్ సాధించిన రికార్డులను బద్దలు కొట్టింది మరికొన్ని రికార్డులకు చేరువగా ఉంది. కేవలం సచిన్ టెండూల్కర్ మాత్రమే. దీంతో నిన్నటి తరానికి నేటి తరానికి కోహ్లీ బ్యాటింగ్లో లెజెండ్స్ అంటూ ఎంతో మంది పేర్కొంటూ ఉంటారు. అయితే ఇదే విషయంపై స్పందించిన పాకిస్తాన్ మాజీ బౌలర్ జునైద్ ఖాన్ మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గ్రేటెస్ట్ క్రికెటర్ సచిన్, విరాట్ కోహ్లీలు కాదు మరొకరు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కింగ్ కోహ్లీ కంటే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మనే గ్రేట్ బ్యాట్స్మెన్ అంటూ బౌలర్ జునైద్ ఖాన్ పేర్కొన్నాడు. సచిన్ ఈతరంలో ఆడి ఉంటే 100 సెంచరీల కంటే ఎక్కువ కొట్టే వాడేమో. నా దృష్టిలో రోహిత్ గ్రేట్. తన వద్ద అన్ని రకాల షాట్లు ఉన్నాయి. వన్డేల్లో రెండుకుమించి డబుల్ సెంచరీలు కూడా చేశాడు రోహిత్ శర్మ. 264 పరుగులు అత్యధిక స్కోర్ కూడా చేశారు. ఇక ఎక్కువ సిక్సర్ల రికార్డు కూడా రోహిత్ శర్మ పేరిట ఉంది. అందుకే అతన్ని అందరూ హిట్ మ్యాన్ అని పిలుస్తూ ఉంటారు అంటూ జునైద్ ఖాన్ చెప్పుకొచ్చాడు.