అంతర్జాతీయ క్రికెట్లో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న ఆటగాళ్లు.. తమ కెరీయర్ ను సుదీర్ఘకాలం పాటు కొనసాగించాలని ఎంతగానో ఆశపడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఒకవైపు ఫిట్నెస్ను కాపాడుకుంటూ.. మరోవైపు మంచి ఫామ్ ని కొనసాగిస్తూ ఇక అంతర్జాతీయ క్రికెట్లో రాణిస్తూ ఉంటారు. అయితే ఎవరైనా ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్లో రాణించడంలో కాస్త తడబాటు గురయ్యాడు అంటే సెలెక్టర్లు నిర్మొహమాటంగా అలాంటి ప్లేయర్ని పక్కన పెట్టేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 అయితే మరి కొంతమంది క్రికెటర్లు పర్సనల్ కారణాలతో ఇంకొంతమంది క్రికెటర్లు వయస్సు మీద పడింది అన్న కారణాలతో తమ అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించడం చేస్తూ ఉంటారు. అయితే ఇలా అంతర్జాతీయ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన దేశవాళి లీగ్ లలో మాత్రం ఆడుతూ ఉంటారు అని చెప్పాలి. కానీ ఆ తర్వాత కాలంలో జట్టుకు తమ అవసరం ఉంది అనుకుంటే రిటర్మెంట్ వెనక్కి తీసుకోవడానికి కూడా సిద్ధమవుతూ ఉంటారు. మొన్నటికి మొన్న వన్డే వరల్డ్ కప్ కోసం ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ వన్ డే ఫార్మాట్ కి ప్రకటించిన రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకున్నాడు.


 ఇక ఇప్పుడు మరో ప్లేయర్ కూడా 2024 t20 వరల్డ్ కప్ కోసం తన రిటైర్మెంట్ వెనక్కి తీసుకోబోతున్నాడు అని తెలుస్తుంది. ఆ ప్లేయర్ ఎవరో కాదు సౌత్ ఆఫ్రికా మాజీ స్టార్ బ్యాట్స్మెన్ ఫ్యాప్ డూప్లెసెస్. అంతర్జాతీయ క్రికెట్ లోకి రీ ఎంట్రీ  ఇవ్వబోతున్నట్లు సమాచారం. t20 వరల్డ్ కప్ సమయానికి పునరాగం చేయబోతున్నాడట. ఇప్పటికే సౌత్ ఆఫ్రికా కోచ్ తో ఇప్పటికే డూప్లిసిస్ చర్చలు జరిపాడట. తాను మళ్ళీ క్రికెట్ లోకి ఎంటర్ ఇస్తానని చెప్పగా.. కోచ్ కూడా సానుకూలంగా స్పందించాడట. కాగా డూప్లేసిస్ తన చివరి అంతర్జాతీయ టి20 మ్యాచ్ 2020లో ఆడాడు. కాగా డూప్లెసెస్ గతంలో ధోని టీం అయిన చెన్నై జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: