- ( స్పోర్ట్‌ - ఇండియా హెరాల్డ్ ) . . .

స‌చిన్ టెండూల్క‌ర్ త‌ర‌వాత రికార్డుల రారాజుగా ఎవ‌రు ? అన్న ప్ర‌శ్న‌కు విరాట్ కోహ్లీ స‌మాధానం అయ్యారు. కోహ్లీని సైతం ఆల్ టైం గ్రేట్ క్రికెట‌ర్ల‌లో ఒక‌రిగా చూస్తారు. స‌చిన్ నెల‌కొల్పిన ఎన్నో రికార్డులు ఇప్ప‌ట‌కీ చెక్కు చెద‌ర్లేదు. అయితే కోహ్లీ దూకుడుతో స‌చిన్ సాధించిన కొన్ని రికార్డుల‌కు చెద‌లు ప‌డ‌తాయా ? అన్న చ‌ర్చ‌లు న‌డిచాయి. ఇప్పుడు కోహ్లీ రిటైర్‌తో స‌చిన్ రికార్డు ఇప్ప‌ట్లో చెక్కు చెద‌ర‌దు అని అర్థ‌మైంది. వ‌న్డే, టెస్ట్ ఈ రెండు ఫార్మెట్ల‌లోనూ 100 సెంచ‌రీలు చేసిన ఘ‌న‌త టెండూల్క‌ర్‌ది. ఆ రికార్డు ఛేదించ‌గ‌ల మొన‌గాడు కోహ్లీ మాత్ర‌మే అని అంద‌రూ అనుకున్నారు. అయితే ఇప్పుడు కోహ్లీ టెస్టుల నుంచి రిటైర్ అయ్యాడు. ఇప్ప‌టి వ‌ర‌కు కోహ్లీ సెంచ‌రీలు చూస్తే 81 (టెస్టులు 30, వన్డేలు 51) మాత్ర‌మే. స‌చిన్ రికార్డు బ్రేక్ చేయాలంటే మ‌రో 20 సెంచ‌రీలు కావాలి.. కానీ కోహ్లీ ఇప్పుడున్న ఫామ్‌లో చూస్తే కోహ్లీ ప్ర‌స్తుతానికి వ‌న్డేలే మాత్ర‌మే ఆడ‌తాడు.


టీ 20 ల‌కు ఎప్పుడో రిటైర్ ఇచ్చేశాడు. ఇప్పుడు అన్నీ జ‌ట్లు వ‌న్డేలు త‌క్కువ ఆడుతున్నాయి. కోహ్లీ కేవ‌లం వ‌న్డేలు మాత్ర‌మే ఆడుతూ మ‌రో 20 సెంచరీలు చేయ‌డం అసాధ్యం. ఈ నేప‌థ్యంలో కోహ్లీ స‌చిన్ రికార్డ్ బ్రేక్ చేయ‌డం చాలా చాలా క‌ష్టం అని చెప్పాలి. కోహ్లీ ప్ర‌స్తుత ఏజ్ 36. వ‌చ్చే వ‌ర‌ల్డ్‌క‌ప్ వ‌ర‌కు ఆడాల‌ని అనుకుంటున్నాడు. ప్ర‌స్తుతానికి ఫిట్‌గా ఉన్నా.. వ‌చ్చే ప్ర‌పంచ‌క‌ప్ వ‌ర‌కూ ఫిట్ నెస్ ని కాపాడుకోవాలంటే ప‌రిమిత మ్యాచ్‌లే ఆడాల్సి ఉంటుంది. ఈ వ్య‌వ‌ధిలో 21 సెంచ‌రీలు కొట్ట‌డం అసాధ్యం. ఏదేమైనా మ‌న మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ నెల‌కొల్పిన ఈ 100 సెంచ‌రీల‌ రికార్డ్ కోహ్లీకే సాధ్యం కాలేదంటే.. మ‌రే ఇత‌ర క్రికెట‌ర్ 100 సెంచ‌రీల రికార్డుకు ద‌రి దాపుల్లో కూడా వెళ్ల‌లేడ‌నే చెప్పాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: