ప్రతి తెలుగు వారి ఇంట్లో రాత్రి 7.30 అయితే చాలు వచ్చే పాట ఏదన్నా ఉంది అంటే అది కార్తీక దీపం సీరియల్ పాటనే. ఈ సీరియల్ కోసం ప్రతి తెలుగు ఇంటి మహిళ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది. అంతలా ప్రేమి విశ్వనాద్ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది..ఏంటి ప్రేమి విశ్వనాధ్ అంటే ఎవరా అని అనుకుంటున్నారా.. !! ఆవిడ మరెవరో కాదండీ కార్తీక దీపంలో  ప్రతిరోజు మనల్ని కంటతడి పెట్టి ఏడిపించే వంటలక్క..దీప అసలు పేరు ప్రేమి విశ్వనాథ్. దీపకు  రెండు తెలుగు రాష్ట్రాల్లోను విపరీతమైన మహిళా  అభిమానులు ఉన్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు..

అసలు  ఇప్పుడు ఈ వంటలక్క టాపిక్ ఎందుకు వచ్చింది అని అనుకుంటున్నారా..?? అసలు వివరాలలోకి వెళితే ప్రేమి విశ్వనాధ్..  ఒక టాప్ లేడీ యాంకర్ తో దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో  ప్రత్యక్షం అయింది.  ఈ ఫోటోను చూసి అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు.ఇంతకీ ఆ యాంకర్ ఎవరా  అనుకుంటున్నారా.. ఆవిడ మరెవరో కాదు...తెలుగులో  టాప్ యాంకర్ గా తన దైన శైలిలో యాంకరింగ్ చేస్తున్న సుమ.. ప్రేమి విశ్వనాథ్‌ స్వస్థలం కేరళ. ఇక సుమ కూడా మలయాళీ కావడం విశేషం. వీళ్లిద్దరు ఇపుడు తెలుగు టీవీ ప్రేక్షకుల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

వంటలక్క,  సుమ కనకాల కలవడం, ఇద్దరు కలిసి ఫోటో దిగడం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోను సుమ కనకాల తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఐతే.. వంటలక్క ..సుమ హోస్ట్ చేసే ఏదైనా ప్రోగ్రామ్‌కు గెస్ట్‌గా వెళుతుందా అనేది చూడాలి.ఈ ఫొటోలో ఇద్దరు కలిసి ఎందుకు ఉన్నారా...అన్నా విషయం ఇంకా తెలియాలిసి ఉంది. సుమ.. ఇప్పటికే క్యాష్‌తో పాటు పలు రియాలిటీ షోస్‌కు యాంకర్‌గా వ్యవహరిస్తోంది. ఈమె హోస్ట్ గా చేసే ప్రోగ్రామ్స్‌‌కు టీవీల్లో మంచి రేటింగే ఉంది.ఎంతోమంది యువతరం యాంకర్స్ బుల్లితెరకు పరిచయం అవుతున్న గాని సుమ కి ఉన్న ప్రాధాన్యత మాత్రం ఏమాత్రం తగ్గలేదు..ఏదయితేనే యాంకర్ సుమ అలాగే మన వంటలక్క ఇద్దరు కలిసి దిగిన ఫోటోను చూసుకుని అభిమానులు ఎంతో మురిసిపోతున్నారు.. !!



మరింత సమాచారం తెలుసుకోండి: