ఇక్కడ మన తెలుగులో కూడా ఈ షో కు ప్రజలు బ్రహ్మరధం పట్టారు. ఆ తరువాత కొన్ని కారణాల వలన కొంత కాలం వరకు ఈ షోకు బ్రేకు పడింది. ఇప్పుడు మళ్ళీ ఈ షోను టైటిల్ మార్చి మన ముందుకు తీసుకువస్తున్నారు జెమినీ టీవీ యాజమాన్యం. ఇక్కడ "మీలో ఎవరు కోటీశ్వరుడు" ను కొద్దిగా మార్చి "ఎవరు మీలో కోటీశ్వరులు" గా చేస్తున్నారు. అయితే ఈ షోకు వ్యాఖ్యాతగా ఈ సారి నాగార్జున కానీ...చిరంజీవి కానీ రావడం లేదు. తెలుగు టెలివిజన్ చరిత్రలో మొట్టమొదటి రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 1 కి హోస్ట్ గా చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఈ షో కి వ్యాఖ్యాతగా చేయనున్నారు. దీనితో ఈ షో పై ప్రేక్షకులకు అంచనాలు భారీగా ఉన్నాయి.
ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ కి చేసే సమయంలో కేవలం ఎన్టీఆర్ కోసమే ఎంతో మంది శని మరియు ఆదివారాలు కోసం వెయిట్ చేసేవారు. అయితే ఏ షో అయినా సినిమా అయినా సీరియల్ అయినా ప్రజల్లోకి వెళ్లాలంటే...ప్రచారం ఎంత ముఖ్యమో తెలిసిందే. ప్రస్తుతం ఈ షో కి కూడా ప్రచారాలను ఒక రేంజు లో చేస్తున్నారు. అన్ని వార్తా పత్రికల్లో మరియు టీవీ లలోనే ప్రకటనలు భారీగా ఇచ్చారు. దీనితో ఈ షో గురించి రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతి ప్రేక్షకుడి మనసులోకి ఈ విషయం వెళ్ళింది. ఇలా ఈ ఒక్క రోజు ప్రకటనలకు వీరు ఖర్చు పెట్టిన మొత్తం అక్షరాలా 3 కోట్ల రూపాయలు. ప్రస్తుతం ఇది రికార్డు గా ఉంది. మిమ్మల్ని కోటీశ్వరులను చేయడానికి ప్రజల ముందుకు తీసుకు పోవడానికి జెమినీ టీవీ యాజమాన్యం ఇంత భారీ మొత్తాన్ని ఖర్చు పెట్టింది. ఈ షో సక్సెస్ భారమంతా కూడా ఎన్టీఆర్ పైనే ఉంది. మరి ఈ షో సక్సెస్ అవుతుందా లేదా చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి