జెస్సీ చేతికి బిగ్ బాంబ్...ఇక ఆ వ్యక్తి కెప్టెన్ అవ్వడం కష్టమే. ఏంటి స్టేట్మెంట్ అనుకుంటున్నారా? అసలు విషయం ఏమిటంటే, బిగ్‌ బాస్ రియాలిటీ షో తెలుగు ప్రస్తుతం 10వ వారంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. పోటీదారులు తగ్గే కొద్దీ పోటీ మరింత కఠినంగా మారుతోంది. ప్రతీ ఒక్కరూ ప్రాణం పెట్టి ఆడుతున్నారు. దాదాపు చివరి దశకు చేరుకోవడంతో స్నేహం వంటివి పక్కన పెట్టి ఆటల్లో ఇచ్చి పడేస్తున్నారు. తమని తాము సేవ్ చేసుకునేందుకు, ప్రూవ్ చేసుకునేందుకు ఆడుతున్నారు. తగ్గేదేలే అన్నట్లుగా టాస్క్ ల్లో లీనమైపోయి ఉన్నారు. నామినేషన్ల ప్రక్రియ సమయంలో ఇదే తీరుతో దూకుడు ప్రదర్శిస్తున్నారు.

నిన్నటి ఎపిసోడ్ లో తమకు నచ్చిన వారిని సేవ్ చేసుకునే సమయం వచ్చినపుడు..గేమ్ పరంగా తనకు హెల్ప్ చేసిన శ్రీ రామ్ మాట విన్నది కాజల్. అందుకే షన్ను ను జైల్ నుండి బయటకు తీసుకొచ్చింది. ఇక్కడ నిజంగానే పెద్ద స్ట్రాటజిని వాడారు అంటున్నారు ప్రేక్షకులు. హెల్ప్ చేసినా చేయక పోయినా తన ఫ్రెండ్స్ అయిన సన్ని, మానస్ ల కోపాన్ని తగ్గించడం కష్టమేమీ కాదు, కానీ శ్రీ రామ్ వంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి అవకాశం వచ్చింది. కాబట్టి ఫ్రెండ్స్ కి హ్యాండ్ ఇచ్చి షన్నును విడుదల చేయించింది కాజల్ అని అంతా అనుకుంటున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ సడెన్ గా జెస్సిని బయటకు పంపేశారు.  

అయితే అలా జెస్సీని సీక్రెట్ రూం లోకి పంపి తదుపరి ఆదేశం వచ్చే వరకు ఉండాల్సి ఉంది. అయితే జెస్సీ తిరిగి ఇంటిలోకి ఎంట్రీ ఇచ్చేటప్పటికి తనకి ఒక బ్రేకింగ్ బాంబ్ ను ఇవ్వబోతున్నారట బిగ్ బాస్. ఆ బాంబ్ ఏమిటంటే ఎవరికైతే ఆ బాంబ్ ను జెస్సీ ఇస్తాడో వారు ఇక  కెప్టెన్ అవడానికి ఛాన్స్ లేదట. గేమ్ చివరి దశకు చేరుకున్న సమయంలో కెప్టెన్ అనేది ఒక బూస్టర్ లాంటిది అది ఎంత ముఖ్యమో తెలిసిందే. అయితే ఇటువంటి సమయంలో ఈ బిగ్ బాంబ్ విషయం నిజమో కాదో తెలియాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: