ఇటీవలే జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ ని టైమింగ్ కూడా మార్చారు.. రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తోంది.. అయితే గతంలో యాంకర్ గా చేసిన సౌమ్యరావు ఎందుకు జబర్దస్త్ విడిచి వెళ్లిపోయిందో అభిమానులకు అర్థం కావడం లేదు.. కానీ తాజాగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇమే.. ఈ విషయం పైన మాట్లాడుతూ.. జబర్దస్త్ తో ఆమె అగ్రిమెంట్ పూర్తి అయింది అందుకే ఈ షో నుంచి క్విట్ అయ్యానని తెలియజేసింది. కేవలం ఒక ఏడాది మాత్రమే అగ్రిమెంట్ చేసుకున్నామని అది కూడా పూర్తి అయ్యిందని అందుకే నెక్స్ట్ ఇయర్ కొత్త ఫేస్ ని ట్రై చేస్తామని చెప్పారట.
దీంతో తాను కూడా ఓకే అని చెప్పానని అక్కడ ఉన్నప్పుడు చాలామంది తనని బాగానే చూసుకున్నారని బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు కూడా క్యాబ్ వంటి సౌకర్యాలు ఇవ్వడమే కాకుండా పేమెంట్స్కు కూడా కరెక్ట్ సమయానికే ఇచ్చేవారని కంటిస్టేంట్ల నుంచి కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు టీం లీడర్స్ జడ్జెస్ ప్రొడక్షన్ టీం అందరూ కూడా బాగా చూసుకున్నారని తెలిపింది. అయితే ఆడియన్స్ తన పేరు ఎక్కువగా వెళ్లలేకపోయింది అప్పుడే యాంకర్ గా వచ్చాను సీరియల్స్ లో కూడా అవకాశాలు వచ్చాయి.. యాంకర్ గా రావడంతో సీరియల్స్ కూడా వదులుకున్నానని తెలిపింది సౌమ్యారావు.. ప్రస్తుతం ఇమే కిరాక్ బాయ్స్, కిలాడి లేడీస్ వంటి షోలు చేస్తోంది.