
జియో డౌన్? అనేక మంది వినియోగదారులు భారతదేశంలో జియో మొబైల్ నెట్‌వర్క్ సమస్యలను నివేధిస్తున్నారు. నెట్‌వర్క్‌కి సంబంధించిన వినియోగదారుల ఫిర్యాదులలో డౌన్ డిటెక్టర్ కూడా పెరుగుతోందని పేర్కొంటున్నారు. జియో నెట్‌వర్క్ అంతరాయంపై పలువురు వినియోగదారులు ట్విట్టర్‌లో ఫిర్యాదు చేశారు. భారతదేశంలో జియో డౌన్ అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. డౌన్ డిటెక్టర్ లో, దాదాపు 4,000 మంది వినియోగదారులు జియో నెట్‌వర్క్‌లో నెట్‌వర్క్ సమస్యలను నివేదించారు.
ప్రజలు ఈ ఉదయం నుండి కనెక్టివిటీ సమస్యలను జియో డౌన్ హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్లర్‌లో టైమ్‌లైన్‌ను చూడటం ద్వారా ఫిర్యాదు చేస్తున్నారు. వినియోగదారుల నుండి నెట్‌వర్క్ సమస్యల పై ఫిర్యాదులతో రిలయన్స్ జియో యొక్క అధికార ట్విట్టర్ అయిన కస్టమర్ సపోర్ట్ హ్యాండిల్, జియో కేర్ అకౌంట్‌లు నిండిపోయాయి . దేశంలోని వివిధ ప్రాంతాల నుండి జియో సబ్‌స్క్రైబర్‌లో జియో నెట్‌వర్క్‌తో సమస్యలను నివేదిస్తున్నారు.
అయితే, ఈ సమస్య దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న పరిమిత సంఖ్యలో వినియోగదారులకు ప్రభావితం చేస్తున్నట్టు తెలుస్తోంది. జియో యూజర్ల అందరికీ ఈ సమస్య లేనట్టుగా కనిపిస్తోంది. ఏదేమైనా, నెట్ వర్క్ సమస్య, డౌన్‌డిటెక్టర్‌పై ఫిర్యాదుల సంఖ్య పెరుగుతూనే ఉంది.