ప్రతి సంస్థ లేదా ఏదైనా పరిశ్రమలు పనిచేసేటువంటి ఉద్యోగులు..EPF కథ అనేది కచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా అతడికి వచ్చే జీతాన్ని అనుసరించీ అలా వచ్చిన జీవితంలో ప్రతినెల కొంతమేరకు జమ అవుతూ ఉంటుంది.. ఇలా ప్రతినెల జమ చేసిన సొమ్మును ఉద్యోగి విరమణ నాటికి పెద్ద మొత్తంలో అందుకుంటారు. ఉద్యోగులందరికీ తమ జీతం నుంచి ప్రతినెల ఈపీఎఫ్ ఖాతాకు సైతం సొమ్ము యాడ్ అవుతుందని విషయం తెలిసినప్పటికీ తమ ఖాతాలో ఎంత డబ్బు ఉందని విషయాన్ని చాలా మంది పట్టించుకోకుండా ఉంటారు. ఉద్యోగి యొక్క సంక్షేమం కోసమే ప్రభుత్వాల సైతం వీటిని ప్రారంభించారు.


అయితే మీ ఖాతా పైన మీకు అవగాహన కచ్చితంగా ఉండాలి.. ఈపీఎఫ్ ఖాతాలో చెందాదారులుగా చేరినప్పుడే UAN నెంబర్ ని సైతం ఇస్తారు దీనిని ఉపయోగించి సులువుగా మీ ఈపీఎఫ్ ఖాతాలో డబ్బు ఎంత ఉందో తెలుసుకోవచ్చు రిటైర్మెంట్ తర్వాత మెరుగైన ఆర్థిక ప్రణాళిక కోసం మీరు ఈ డబ్బును సైతం ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ డబ్బు తెలుసుకోవడం కోసం చాలా సులువైన మార్గాలు ఉన్నాయి..

ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి గూగుల్ ప్లే స్టోర్ ను, యాపిల్ పే స్టోర్ నుంచి ఉమాంగ్ యాప్ను కూడా ఉపయోగించుకొని చూసుకోవచ్చు. అక్కడ అవసరమైన వివరాలను అందించి లాగిన్ అయిన తర్వాత స్క్రీన్ మీద కనిపించే సూచనలను ఫాలో అవుతే మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.


SMS ద్వారా:
ముందుగా మీ మొబైల్లోని మెసేజింగ్ యాప్ ను ఓపెన్ చేసి..EPFOHO UAN TEL టైప్ చేసి..7738299899 అనే నెంబర్ కి పంపించాలి వెంటనే మీకు ఎస్ఎంఎస్ రూపంలో ఈపీఎఫ్ బ్యాలెన్స్ చూపిస్తుంది.


UAN నెంబర్ ద్వారా తెలుసుకోవాలంటే:
కొంతమంది ఉద్యోగులు నెంబర్ ని మరిచిపోతూ ఉంటారు దీనివల్ల తమ ఈపీఎఫ్ బ్యాలెన్స్ ఎలా తెలుసుకుంటారని విషయానికి వస్తే.. ముందుగా ఈపీఎఫ్ఐఎన్ DIG.GOV. పోర్టల్ లోకి వెళ్ళాలి.. అక్కడ పేజీలో నౌ యువర్ ఆప్షన్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది.. ఆ తర్వాత పిఎఫ్ ఖాతా నెంబర్ మొబైల్ ఐడి నెంబర్ను ఎంటర్ చేస్తే మొబైల్ నెంబర్ కు ఒక పిన్ వస్తుంది.. ఆ పిన్ ఎంటర్ చేస్తే ..యుఏఎన్ నెంబర్ మీ మొబైల్ కి మెసేజ్ రూపంలో వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: