మన హిందూ సాంప్రదాయం ప్రకారం గోమాతను, తులసి మొక్కను  అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించుకుంటూ ఉంటారు. అలాంటిది మనం పూజించే విధానంలో కూడా మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల కారణంగా అది మన జీవన విధానంపై కూడా దెబ్బతీస్తుంది. ముఖ్యంగా ఇంటి ముందు తులసి కోట ఉంటే చాలా అదృష్టం అని మన ఇంటికి ఎంతో మంచి జరుగుతుందని చాలామంది నమ్ముతారు. రోజు తల స్నానం చేసి తులసి కోట దగ్గర దీపం వెలిగించి పూజ చేస్తే ఎన్నో శుభాలు కలుగుతాయని  ప్రతి ఒక్కరి నమ్మకం..


అయితే మనలో చాలామంది తెలిసీ తెలియక తులసి ఆకులను వాడకూడని  విధంగా వాడుతుంటారు. అలా చేస్తే  తులసి మాత కు ఆగ్రహం వస్తుందని పండితులు చెబుతున్నారు. అయితే తులసి మాత కు ఆగ్రహం వస్తే, తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా హెచ్చరిస్తున్నారు..  అయితే సాధారణంగా పరమేశ్వరుడికి పూజ చేసేటప్పుడు తులసి ఆకులను వాడకూడదు. ఎందుకంటే రాక్షసరాజైన జలంధరుడు తులసి మాత భర్త. అయితే జలంధరుడుని ఎవరు చంపకూడదనే వరం కూడా ఆయనకు ఉంది. ఓసారి దేవేంద్రుడితో యుద్ధం జరిగినప్పుడు, ఆ సమయంలో దేవేంద్రుడు తనను రక్షించమని శివుడిని కోరాడు. ఆ క్రమంలో శివుడు ఇచ్చిన సలహాతో జలంధరుడు  చనిపోతాడు. దాంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆగ్రహించిన తులసిమాత,శివపూజకు తన ఆకులను వాడకూడదని శపించింది. కాబట్టి శివలింగానికి పూజ చేసేటప్పుడు తులసి ఆకులను వాడకూడదు.


మరీ ముఖ్యంగా పండుగలు, ప్రత్యేక పర్వదినాలను తులసి ఆకులను తెంపకూడదు. ముఖ్యంగా ఏకాదశి, ఆదివారం,సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వంటి సమయాలలో తులసి జోలికి వెళ్ళకూడదు. అలా చేస్తే తులసి మాతకు  ఆగ్రహం వచ్చి అంటు వ్యాధులు కూడా సోకే ప్రమాదం ఉందని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా వినాయకుడి పూజలో కూడా తులసి ఆకులను ఉపయోగించకూడదు.


ఇక అంతేకాకుండా తులసి మొక్కను ఇంట్లో పెంచుకో కూడదు. ఎందుకంటే తులసి ఆకులకు ఎండ తగలకుండా చనిపోయే ప్రమాదం ఉంది.ఇంట్లో అనర్ధాలు ఎదురయ్యే అవకాశం కూడా ఎక్కువ.కాబట్టి తులసి మొక్కను ఎంత వీలైతే అంత బయటనే పెంచుకొనేందుకు ట్రై చేయండి...

మరింత సమాచారం తెలుసుకోండి: