
పెండ్లిలో అందంగా కనిపించాలని ఏ వధువుకైనా ఉంటుంది. పెండ్లి దుస్తుల్లో మెరిసిపోవాలని ఏ అమ్మాయికైనా ఉంటుంది. అందకే చాలా బాగా ముస్తాబవుతుంటారు. పాకిస్తాన్‌కు చెందిని ఒక అమ్మాయి వినూత్నంగా ఆలోచించింది. బరువైన లెహంగాను వేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఆమె వంది కిలోల లెహెంగా వేసుకొని పెండ్లి చేసుకుంది. ఆ లెహంగాతో ఆమె అష్టకష్టాలు పడింది. పెండ్లికొడుకు పక్కన ఆమె లెహంగా మెట్లను దాటి పరుచుకున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది ఇప్పడు. దాంతో వేడుకకు వచ్చిన మహిళలంతా లెహంగా బరువు గురించే మాట్లాడుకున్నారు. మరోవైపు పెండ్లి కొడుకు మాత్రం గోల్డెన్ షేర్వాణి, మెరూన్ తలపాగాతో చాలా సింపుల్‌గా తయారయ్యాడు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఇది ఏడాది కిందటి వీడియో. అయినా కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు చాలా రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
లెహంగాకు చాలా డబ్బులు ఖర్చు చేసి ఉంటారని కొందరు, మరికొందరు ఆమె డ్రెస్ బాగుందని మెచ్చుకుంటున్నారు. ఇంకొందరైతే లెహంగాను ఆమె ధరించిందా లేక లెహెంగానే ఆమెను ధరించిందా అని వినూత్న కామెంట్లు చేశారు యూజర్లు. అతిథులకు రెడ్‌కార్పెట్ బదులుగా రెడ్ లెహెంగా స్వాగతం పలికిందని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వైరల్ అవుతున్న వీడియొ చూడండి.