కర్ణాటక హైకోర్టు తాజాగా ముస్లిం వివాహం పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది.. అది ఏమిటంటే హిందూ మతం లో వివాహం జరిగినట్లుగా ధార్మికమైనది ముస్లిం వివాహం కాదు అని , ఒకవేళ ముస్లిం వివాహం రద్దయితే బాధ్యతలు మాత్రం అస్సలు పోవు  అని వ్యాఖ్యానించింది.. అంతేకాదు ముస్లిం వివాహం అనేది ఒక కాంట్రాక్ట్ వివాహం మాత్రమే అని, కర్ణాటక హైకోర్టు పేర్కొనడంతో ప్రస్తుతం ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి.. కర్ణాటక హైకోర్టు ఎందుకు ఇంతటి దారుణమైన వ్యాఖ్యలు చేసింది అనే విషయానికి వస్తే..

బెంగళూరు లో వున్న  భువనేశ్వరి నగర్ కు చెందిన ఎజాజుర్  రెహమాన్ అనే వ్యక్తి సైరాభాను అనే అమ్మాయికి ఐదు వేల రూపాయలను కట్నం కింద చెల్లించి వివాహం చేసుకున్నాడు.. కానీ వీరిద్దరి మధ్య ప్రతిరోజు మనస్పర్ధలు తలెత్తుతూ ఉండడంతో నవంబర్ 5 1991 న ముమ్మారు తలాక్ చెప్పి.. తన భార్య సైరాభాను కు విడాకులు ఇచ్చాడు రెహమాన్.. అయితే మరి కొన్ని రోజుల తర్వాత ఇతడు మరో వివాహం చేసుకున్నాడు.. అంతేకాదు ఒక బిడ్డకు తండ్రి కూడా అయ్యాడు.. కానీ 2002 ఆగస్టు 24వ తేదీన రెహమాన్ మొదటి భార్య సైరాభాను.. తన ఆర్థిక పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని,  ఖర్చుల కోసం డబ్బులు కావాలి అని తన భర్త రెహమాన్ పై కేసు వేసింది..

ఇక బెంగళూరులో ఉన్న ఫ్యామిలీ కోర్టు న్యాయనిర్ణేత సైరాభాను కు అనుకూలంగా తీర్పు చెప్పారు.. ఆ తీర్పు ఏమిటంటే సైరాభాను చనిపోయేవరకు లేదా మరో వివాహం చేసుకునే వరకు కచ్చితంగా రెహ్మాన్ నెలకు మూడు వేల రూపాయల చొప్పున ఆమెకు చెల్లించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.. కానీ ఈ తీర్పు ఒప్పుకోని రెహమాన్ ,ఫ్యామిలీ కోర్టును సవాలు చేస్తూ హైకోర్టు మెట్లు కూడా ఎక్కాడు.. ఇక్కడ కూడా రెహమాన్ కు చుక్కలు ఎదురయ్యాయి..

ముస్లిం పద్ధతిలో వివాహం అనేది ఒక కాంట్రాక్టు మాత్రమే అని ,దీనికి ఎన్నో అర్థాలు కూడా ఉంటాయని తెలిపింది.. అంతేకాదు హిందూ వివాహం లాగా ముస్లిం వివాహం ఒక ధార్మికమైనది కాదని.. వివాహం రద్దు అయిన తర్వాత కూడా జీవితభాగస్వామి పై హక్కులు ఉంటాయని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.. అంతేకాదు కొన్ని న్యాయపరమైన బాధ్యతలు కూడా ఏర్పడతాయని, విడాకులు ఇచ్చిన మాజీ భార్యకు తప్పకుండ సాయం అందించడం కూడా ఈ బాధ్యతలలో ఒకటే అని , ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: