అడవికి రారాజు అయిన సింహాలు వేటాడే విధానం ఎంత భయంకరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మిగతా జంతువుల్లాగా చిన్న చిన్న జంతువులపై కాదు ఏకంగా భారీ ఆకారం ఉన్న జంతువులను వేటాడటానికి సింహాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఎంతటి భారీ జంతువునైన  సరే మట్టి కనిపించి ఆహారంగా మార్చుకుంటూ ఉంటాయి  ఒక్కసారి సింహం కన్ను పడింది అంటే ఇక ఆ జంతువుకు అదే లాస్ట్ బర్త్ డే అని చెప్పాలి. అదే సమయంలో కొన్ని కొన్ని సార్లు ఏకంగా సింహాలకు ఆహారంగా మారిపోయే జంతువులే వాటికి చుక్కలు చూపించడం లాంటివి చేస్తూ ఉంటాయి. ఏకంగా చిన్న చిన్న జంతువుల చేతిలో సైతం ఓడిపోయి సింహాలు నిరాశగా వెనుతిరగాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఘటనకు సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఒక జీబ్రాను వేటాడాలని నిర్ణయించుకుంది సింహం. ఈ క్రమంలోనే ఎప్పటి లాగానే ఆ జీబ్రా పై  పంజా విసిరింది. తన నోటితో గొంతును పట్టుకొని ప్రాణాలు తీయాలని ప్రయత్నించింది. కానీ ఆ జీబ్రా మాత్రం సింహానికి అస్సలు లొంగలేదు.


 ఊహించని రీతిలో ఆ సింహం నుంచి ఎస్కేప్ అయింది. ఆడసింహం ఒంటరిగా ఉన్న జీబ్రాను  టార్గెట్ చేసి సరైన సమయం చూసి వేగంగా వెళ్లి పంజా విసిరింది. అయితే సింహం దాడిని ఊహించని జీబ్రా దాన్ని నుండి తప్పించుకునే క్రమంలో పరుగులు పెడుతుంది. అయినా సింహం వదలకుండా జిబ్రా మెడను గట్టిగా పట్టుకుంటుంది. దీంతో ఏకంగా సింహాన్ని ఈడ్చుకుంటూ వెళ్తుంది జీబ్రా. తర్వాత ఈ రెండు కూడా పల్టీలు కొడతాయి. అయినా సింహం  వదలదు. చివరికి గట్టిగా వదిలించుకోగానే.. అప్పటికే అలసిపోయిన సింహం పట్టు విడుస్తుంది. దీంతో బతుకు జీవుడా అనుకుంటూ జీబ్రా  అక్కడ నుంచి ఎస్కేప్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: