జీవితంలో ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే సరైన ప్రణాళిక కావాలి. ప్రణాళిక ఉంటే మాత్రమే సులభంగా విజయం సాధించడం సాధ్యమవుతుంది. ప్రణాళిక లేకపోతే మనస్సులోకి ఏ ఆలోచన వస్తే ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటాం. సంపూర్ణ జీవితానికి పక్కా ప్రణాళిక కావాల్సిందే. సైంటిస్ట్ కావాలనో, డాక్టర్ కావాలనో, ఇంజనీర్ కావాలనో అనుకుంటే సరిపోదు. అందుకు తగ్గ కృషి చేయాలి. 
 
ఏ పనినైనా ప్రారంభించే ముందు ఆత్మ విశ్వాసంతో మొదలుపెట్టాలి. ప్రతి మనిషికి తనపై తనకు ఉండే నమ్మకాన్ని ఆత్మవిశ్వాసం అంటాము. నేను చేయగలను అని మనల్ని మనం నమ్మి ప్రయత్నం మొదలుపెడితే సక్సెస్ సులువుగా సొంతమవుతుంది. మనిషికి ఆత్మ విశ్వాసం శక్తివంతమైన ఔషధంలా పని చేస్తుంది. ఆత్మ విశ్వాసం ఉన్నవాళ్లు అనుకున్నది అనుకున్న విధంగా సాధించగలరు. 
 
ఎంత ఎక్కువ ఆత్మవిశ్వాసం ఉంటే అంత సులభంగా విజయం సాధించడం సాధ్యమవుతుంది. ఆత్మవిశ్వాసం పెరగాలంటే మొదట మనపై మనకు పూర్తిగా అవగాహన ఉండాలి. మన బలాలు, బలహీనతలు పూర్తిగా తెలిసి ఉండాలి. మన బలహీనతల గురించి ఇతరులకు తెలియకుండా జాగ్రత్త వహించాలి. మనపై మనకు ఉన్న ఆత్మవిశ్వాసమే మన మాటల్లో, చేతల్లో కనిపిస్తూ ఉంటుంది. 
 
విజయానికి కావాల్సిన ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించడానికి సరైన శిక్షణ కూడా అవసరం. మనలో ఉన్న ఆత్మవిశ్వాసం ఇతరుల్లో కూడా విశ్వాసాన్ని నింపగలదు. విజయం సాధించిన వారికి, విజయం సాధించని వారికి మధ్య ఉండే ముఖ్య తేడా ఆత్మ విశ్వాసమే అని గుర్తుంచుకోవాలి. మనపై మనం పూర్తిస్థాయిలో నమ్మకం ఉంచి విజయం కోసం ప్రయత్నం చేస్తే సక్సెస్ తప్పక సొంతమవుతుందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఇతరుల మాటలను పట్టించుకుంటే ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకోకుండా ప్రయత్నం చేస్తే అసాధ్యమైన పనిలోనైనా సక్సెస్ సాధించవచ్చు.   

మరింత సమాచారం తెలుసుకోండి: