టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒక వెలుగు వెలుగుతున్న హీరో జూనియర్ ఎన్టీఆర్... కెరీర్ లో ఎన్ని విజయవంతమైన సినిమాల్లో నటించి, నేడు తెలుగు సినిమాను శాశిస్తున్న హీరో ఎన్టీఆర్. టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో అంత పాపులర్ అయిన హీరో మరొకరు లేరు అనేది వాస్తవం. నందమూరి కుటుంబం నుంచి వచ్చినా సరే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని నేడు టాలీవుడ్ లో అగ్ర హీరోగా తనకంటూ ఒక ముద్ర వేసుకున్నాడు తారక్. టాలీవుడ్ లో ఇంత తక్కువ కాలంలో ఇంత గుర్తింపు వచ్చిన హీరో మరొకరు లేరు అనేది వాస్తవం. 

 

అగ్ర హీరో గా ఒక వెలుగు వెలుగుతున్న తారక్ కి ఆయన కెరీర్ లో తల్లి ప్రోత్సాహం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అంటూ ఉంటారు అతని గురించి బాగా తెలిసిన వాళ్ళు. అతను అసలు వ్యాపారం చేసుకుందాం లేదా విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేసుకుందామని భావించారట. తండ్రి హరికృష్ణ మద్దతు కూడా తొలి రోజుల్లో ఉండేది కాదని కాని ఆ తర్వాత అతని తల్లి శాలిని అతనికి అండగా నిలబడటమే కాదు అగ్ర దర్శకులతో అతని గురించి మాట్లాడి అవకాశాలు ఇవ్వాలని కోరే వారట. ఇక కథలను ఆమె స్వయంగా విని ఎన్టీఆర్ కి సినిమాలను ఓకే చేసిన సందర్భాలు ఉన్నాయని అంటూ ఉంటారు. 

 

ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించాడు అయితే అతని ప్రతీ సినిమా కథ కూడా ఇప్పటికి తల్లి శాలిని వింటూ ఉంటారని ఆమె కథ విన్న తర్వాతే అతను సినిమాను ఓకే చేసే వాడు అని అంటున్నారు. ఇప్పటికి కూడా అతని సినిమాల గురించి అన్ని విషయాలను ఆమె పట్టించుకుంటూ ఉంటారని అతన్ని దగ్గరగా గమనించిన వారు చెప్తూ ఉంటారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: