ఆడవాళ్ళ అందాన్ని వర్ణించాలంటే ఎన్ని మాటలు అయిన సరిపోవు. గులాబీ లాంటి ఎర్రని పెదాలు, చెక్కినట్టు ఉండే ముక్కు, అందమైన చిరునవ్వు, నవ్వితే ముత్యాల్లా ఉండే పళ్ళ వరస..  ఇవన్నీ అమ్మాయిల అందానికి కేర్ అఫ్ అడ్రెస్ అయితే..కొంతమంది ఆడవాళ్లు నవ్వినప్పుడు బుగ్గల్లో వచ్చే సొట్టలు మరో ఆకర్షణీయమైన అందం.. అలాంటి ఆడవాళ్లు నవ్వితే చూడాలని అనుకునేవాళ్లు చాలా మంది ఉన్నారు. చొట్ట బుగ్గలతో వాళ్ళ అందం ఇంకా రెట్టింపు అవుతుంది.. బుగ్గల భాగంలోని చర్మంలో గుంటలా ఏర్పడే దాన్ని సొట్ట అని పిలుస్తారు. ఇది చర్మానికి ఆధారమైన కండ ఆ ప్రాంతంలో లేకపోవడం వల్ల ఈ సొట్ట ఏర్పడుతుంది. ఇవి బుగ్గలపై ఏర్పడతాయి. సొట్ట బుగ్గలు ఉండటం ఎప్పటికీ ఓ ఎట్రాక్షనే! కానీ సొట్టబుగ్గలు పుట్టుకతో రావాల్సిందే కానీ మనం కావాలనుకుంటే వచ్చేవి కాదు. అయితే కొంతమంది ఆడవాళ్ళకి చొట్ట బుగ్గలు అంటే భలే ఇష్టం.. చొట్ట బుగ్గలు ఉన్న ఆడవాళ్ళని చూసినప్పుడల్లా మనకి కూడా అలా డింపుల్ పడితే బాగుండు అనుకునే వారు చాలామందినే ఉన్నారు. అందుకనే  ప్రతిదానికీ ఓ ఉపాయం ఉన్నట్లే వీటికి కూడా ఉందంటున్నారు కాస్మాలజిస్టులు. కొన్ని చిట్కాలు పాటిస్తే డింపుల్స్‌ మీ సొంతం అవుతాయంటున్నారు.అవేంటో తెలుసుకుందాం.. !!



ఆడవాళ్లు సెల్ఫీలు లాంటి ఫొటోలు తీసుకునేటప్పుడు టెంపరరీగా సొట్ట బుగ్గలు కావాలంటే ఓ పని చేయండి. వేలితో కానీ, పెన్సిల్‌తో కానీ బుగ్గ మీద ఓ అయిదు నిమిషాలు నొక్కి ఉంచితే బుగ్గలు టెంపరరీగా సొట్టపడతాయి. అంటే ఒక 2 నిమిషాల పాటు డింపుల్ అలానే ఉంటుంది..అలాగే చొట్ట బుగ్గలు కావాలనుకునేవారు ప్రతి రోజూ ఓ అరగంట పాటు బుగ్గల్ని వేలితోగాని  లేదా పెన్సిల్‌తో గాని  నొక్కి ఉంచితే పర్మనెంట్‌గా బుగ్గలు సొట్టబడతాయని చెబుతున్నారు. ఇలా ప్రతిరోజు క్రమం తప్పకుండ చేయాలి. కానీ ఇదెంతవరకు వాస్తవమో అన్న విషయం మీద క్లారిటీ లేదు.



సొట్టబుగ్గలకి కావాలనుకునే ఆడవాళ్లకి అన్నింటికంటే మంచి చిట్కా ఉంది. అదేంటంటే  నవ్వేటప్పుడు కనుక  మనం మనస్ఫూర్తిగా విశాలంగా నవ్వితే... చాలామంది బుగ్గలు సొట్టపడతాయట.అలాగే  మేకప్‌ వేసుకునేటప్పుడు ఓ చిన్న చిట్కా పాటించినా బుగ్గల మీద సొట్ట ఉన్నట్లు కనిపిస్తుంది. దానికోసం నవ్వేటప్పుడు మడత పడే చోట... మన స్కిన్‌ రంగు కంటే కాస్త తక్కవ రంగు ఫౌండేషన్‌ని గుండ్రంగా అప్లై చేయాలి.తర్వాత ఒక క్లాత్ తో తుడిచి తుడవనట్లు చిన్నగా తుడవాలి..ఇవేవీ వద్దు..  మీకు శాశ్వతంగా సొట్టబుగ్గలు కావాలనుకుంటే అయితే దానికి చిన్నపాటి కాస్మొటిక్ సర్జరీ చేయించుకుంటే సరిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: