'ఆకాశమే నీ హద్దురా' చిత్రం జి.ఆర్.గోపినాథ్ జీవిత కథ ఆధారంగా సుధ కొంగర దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం. ఇటీవలే ఈ చిత్రం ఆస్కార్ నామినేషన్స్ లోను చోటు సంపాదించండి. మోహన్ బాబు, ఊర్వశి, సూర్య, అపర్ణ బాలమురళి, పరేష్ రావల్ ముఖ్య పాత్రధారులుగా చేసిన చిత్రం నవంబర్ 11 న అమెజాన్ ప్రైమ్ లో విడుదలై సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది.

నిజ జీవిత కథ  ఆధారంగా తెరకెక్కిన సినిమా కాబట్టి పాత్రల పేర్లు కూడా అందుకు తగ్గట్టే పెట్టడం జరిగింది.అయితే సినిమా క్లైమాక్స్ లో ఒక లేడీ ఫైలెట్ ఉండటం మనం గమనించవచ్చు. సూర్య తల్లి ఊర్వశి ఆమెను చూసి 'ఫ్లైట్ ను నడిపింది ఈ అమ్మాయేనా' అని ఆశ్చర్యంగా అడగడం మనం చూసే ఉంటాము. ఆ సినిమా విడుదల అనంతరం చాలా మందికి ఆ పైలెట్ ఎవరు అని తెలుసుకోవాలనే ఆసక్తి ఏర్పడింది. ఆమె గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పైలెట్ పాత్రలో నటించిన ఆమె పేరు వర్ష నాయర్. నిజజీవితంలోను ఆమె ఒక పైలెట్. వర్ష నాయర్ ఇండిగో ఎయిర్ లైన్స్ లో పైలెట్ గా విధులు నిర్వహిస్తుంది. ఆమె భర్త కూడా పైలెట్ కావడం విశేషం. అయన ఎయిర్ ఇండియా లో విధులు నిర్వర్తిస్తున్నాడు. దర్శకురాలు సుధ కొంగర వర్ష ని ఆ పాత్ర కోసం సంప్రదించగా తాను వెంటనే ఒప్పుకొని చేయడం జరిగింది.    

గోపినాథ్ జీవిత కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అయన 'సింప్లిఫ్లయ్' పేరుతో ఒక బుక్ నీ కూడా రాసారు. అయితే గోపినాథ్ 'ఎయిర్ డెక్కన్' స్థాపించి తక్కువ ధరకే విమాన ఎక్కే ప్రతి ఒక్క సామాన్యుడి కలను నిజం చేసారని చెప్పవచ్చు. బెంగుళూరు కేంద్రంగా 2003 లో 'ఎయిర్ డెక్కన్' తన సేవలను ప్రారంభించింది. దేశంలోనే తక్కువ ధరకే విమాన ప్రయాణాన్ని అందించిన ఏకైక విమానయాన సంస్థగా 'ఎయిర్ డెక్కన్' నిలిచింది. అటు తర్వాత ఎయిర్ డెక్కన్ కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ లో విలీనం అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: