శోభన నటిగా మాత్రమే మనకి తెలుసు కానీ ఆమె భరతనాట్య నృత్యకారిణి అని మీలో ఎంతమందికి తెలుసు. అవును శోభన నటనతో మనకి దగ్గరైన తన నృత్య ప్రదర్శనలతో దేశ విదేశాల్లోనూ మంచి గురింపు సాధిస్తుంది. మన తెలుగు వాళ్లకు కూడా శోభన అంటే నటిగా కాకూండా ఒక నృత్యకారిణిగా గుర్తుపడతారు.

ప్రస్తుతం శోభన కళారాధనకే  అంకితం  అయ్యారు. పూర్తిగా తన నాట్యకళకే జీవితాన్ని అంకితం చేసారు. శోభన చెన్నైలో 'కళార్పణ' అనే పేరుతో ఒక నాట్య శిక్షణాలయాన్ని స్థాపించి ఎందరికో భారతనాట్యంలో శిక్షణని ఇస్తున్నారు. మరియు వారితో కలిసి విదేశాల్లో అనేక నాట్య ప్రదర్శనలను ఇస్తున్నారు.

ఇక శోభన ప్రముఖ హీరోలతో చేసిన సినిమాల విషయానికి వస్తే, కె.బాలచందర్ దర్శకత్వం లో చిరంజీవి హీరోగా చేసిన 'రుద్రవీణ' లో హీరోయిన్ గా శోభన నటించారు. ఆ తర్వాత 'రౌడీ అల్లుడు' సినిమా లో కూడా చిరంజీవి సరసన శోభన నటించారు. అలాగే బాలకృష్ణ, నాగార్జున మరియు వెంకటేష్ వంటి హీరోలతో రెండేసి చిత్రాల్లో నటించి మెప్పించారు.

అంతేకాకూండా శోభన మరియు మోహన్ బాబు  కాంబినేషన్ అప్పట్లో బెస్ట్ జోడిగా మంచి  పేరుతెచ్చుకుంది. వారిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అల్లుడు  గారు, రౌడీ పెళ్ళాం వంటి చిత్రాలు రాగా, రెండు ఘన విజయాలను నమోదు చేసుకున్నాయి. ఆ తర్వాత రాజేంద్రప్రసాద్ తో చేసిన 'ఏప్రిల్ ఒకటి విడుదల', 'అభినందన' వంటి చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించారు. టాలీవూడ్ లో కేవలం పదుల సంఖ్యలోనే సినిమాల్లో నటించిన శోభన తన నటనతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. మనషి పాత్ర వస్తే తప్పకుండ సినిమాల్లో నటిస్తానని శోభన అంటున్నారు.

ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉంటూ పూర్తిగా నాట్య కళకి అంకితం అయ్యారు శోభన.  నాట్య కళకి గుర్తుగా భారత ప్రభుత్వం శోభన కి  'పద్మశ్రీ' అవార్డు ఇచ్చి సత్కరించింది. వయసు  పెరిగిన కూడా ప్రతిరోజు భరతనాట్యం సాధనచేస్తూ  కళ పై ఉన్న మక్కువని చూపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: