యుద్ధాలలో పాల్గొనే వారికి ఎంతో ధైర్య సాహసాలు ఉండాలి.. అవి ఒక్క మగవారికి మాత్రమే ఉంటాయనుకుంటే పొరపాటే.. ఎంతో మంది మహిళలు యుద్ధం లో పోరాడి గెలిచిన సంఘటనలు చరిత్రలో చాలా ఉన్నాయి.. అయితే ఇప్పటి తరం మహిళలు ఆ విధమైన ధైర్యసాహసాలు చూపుతారా అంటే అప్పటికీ ఇప్పటికీ వారిలో ఆ గుణం అస్సలు మారలేదు అనే చెప్పాలి.. అందుకు ఉదాహరణ ఆర్మేనియా దేశానికి చెందిన ప్రధాని భార్య నే..

ఆర్మేనియా కి , అజర్ బైజన్ కు మధ్య సెప్టెంబర్ నెల నుంచి యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే.. ఆ యుద్ధంలో ఇప్పటికే సుమారు వెయ్యి మంది ప్రాణాలు కోల్పోగా యుద్ధం లో పాల్గొనేందుకు తాను శిక్షణ తీసుకుంటున్నానని ఆర్మేనియా ప్రధాని నికొల్ శశిన్యన్ భార్య హకొవ్యన్ తెలిపింది.. ఈ మేరకు ఆమె తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.. ఆమె ఇప్పటికే కొంతమంది మహిళలతో కలిసి ఏడు రోజుల పాటు మిలటరీ లో శిక్షణ తీసుకుందట.. ఆయుధాలను ఎలా వాడాలి, వాటిని ఉపయోగించే బుల్లెట్లు తదితర విషయాలపై ఆమె శిక్షణ తీసుకుంటున్నానాని అని వెల్లడించింది.. ఈ శిక్షణ పూర్తయిన వెంటనే నాగోర్నో, ఖరబుక్ ప్రాంతంలో ఆర్మీ ఇండియా మిలిటరీ తో కలిసి యుద్ధంలో పాల్గొననుందట..

ఈ 42 ఏళ్ల ప్రధాని భార్య కు 20 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు.. అతను కూడా ఈ ఉద్యమంలో పాల్గొనేందుకు శిక్షణ తీసుకుంటున్నాడట.. ఈమె ఆ దేశానికి చెందిన టైమ్స్ న్యూస్ పేపర్ కు చీఫ్ ఎడిటర్ గా కూడా వ్యవహరిస్తుంది.. ఈ క్రమంలోనే ఆమె అమెరికా, కెనడా, ఫ్రాన్స్ , బ్రెజిల్ ,సింగపూర్ , వియత్నాం దేశాలకు చెందిన అధ్యక్షుల భార్యలకు లేఖ లు కూడా రాసింది.. మా ఇరు దేశాల మధ్య జరిగే ఈ యుద్ధాన్ని ఆపేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొందట.. అలాగే నాగోర్నో, ఖరబుక్ ప్రాంతాలకు స్వాతంత్య్రం ఇవ్వాలని కోరింది..

మరింత సమాచారం తెలుసుకోండి: