సమాజంలోని మహిళల్లో అసాధారణ ప్రతిభ ఉందని కొంతమంది ద్వారా తెలుస్తుంది. ఎంతోమంది తమలోని టాలెంట్ ను సరైన దారిలో ఉపయోగించుకుని గొప్ప గొప్ప వారు అయిన వారు ఉన్నారు. బిజినెస్ పర్సన్స్ గా, ఫ్యామిలీ ఉమెన్స్ గా చాలామంది తమ తమ కర్తవ్యాలను నెరవేరుస్తూ ఎంతో గొప్ప స్థాయికి వెళ్లారు. ఆ విధంగా ఇప్పుడు చెప్పబోయే ఓ మహిళ ఎంతో గొప్ప ఆలోచనను చేసింది. మన చుట్టూ ప్రపంచంలో మనం వాడి పారేసిన అనేక వస్తువులు పదార్థాలు సరిగ్గా ఉపయోగించుకుంటే మనకు ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది అని ఆలోచించి వాటితో అద్భుతమైన పని చేస్తుంది. మరి ఈ యువతి ఎవరు ఏం చేస్తుందో ఇప్పుడు చూద్దాం..
వాడి పడేసిన కొబ్బరిచిప్పలను అందమైన పాత్రలుగా మలిచి, దాన్ని ఆదాయ వనరుగా మార్చుకుంది. చక్కని లాభాలను సాధిస్తోంది. కేరళకు చెందిన కురియాకోస్ అనే మహిళ. అందుకుగాను ఆమె తెంగా అనే స్టార్టప్ ను ప్రారంభించింది. కొబ్బరి చిప్పలను యంత్రం సహాయంతో పాత్రలుగా మారుస్తారు ఈ సంస్థ. పలువురు కళాకారులు కూడా నియమించుకుంది. ఈ క్రమంలోనే ఆమె వ్యాపారం విజయవంతంగా నిర్వహిస్తోంది.
సాధారణంగా ఇళ్ళల్లో చిన్న చిన్న పాత్రలను స్టీల్ ప్లాస్టిక్ వంటి పదార్థాలతో తయారు చేసినది వాడతాము. కానీ కొబ్బరి చిప్ప ల తో తయారు చేసిన కిచెన్ వేర్ అద్భుతంగా ఉంటుంది. ఆ పాత్రలలో వేటినైనా ఉంచవచ్చు. చాలా సహజమైన పదార్ధం కనుక వాటిలో ఆహారాలను ఉంచితే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. ప్రస్తుతం ఆమె కేరళలో ఐదు జిల్లాల్లో 12 మంది కళాకారులతో వ్యాపారం నిర్వహిస్తోంది. కొబ్బరి చిప్పలను అందమైన పాత్రలు గా మలుస్తూ వాటిని సెట్ ల వారిగా విక్రయిస్తోంది. ఇప్పటికే ఎంతోమంది ఆ పాత్రలను కొనుగోలు చేశారు ఈ క్రమంలోనే ఆ పాత్రలకు కస్టమర్ల నుంచి మంచి స్పందన తో పాటు మరిన్ని కావాలనే డిమాండ్ కూడా ఏర్పడుతుందట.