
ఈ సంగతి పక్కన పెడితే తాజాగా మాళవిక మోహనన్ సోషల్ మీడియా వేదికగా తన ఫాలోవర్స్ తో చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగే ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చింది. మీరు ఒకరోజు కెరీర్ మార్చుకోగలిగితే ఏం చేయాలనుకుంటున్నారు? అని ఓ వ్యక్తి ప్రశ్నించగా.. తాను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కావాలనుకుంటున్నానని, ప్రకృతి మరియు అడవులు తనను ఎంతో సంతోషపరుస్తాయని మాళవిక తెలిపింది.
మీ తదుపరి సినిమాను ఏ డైరెక్టర్ తో కలిసి వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారు? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. `నా దగ్గర చాలా పెద్ద లిస్ట్ ఉంది, కానీ ఇప్పుడే ఒక డైరెక్టర్ ను ఎంచుకోవాల్సి వస్తే, రాజమౌళి సర్‌తో కలిసి పనిచేయడానికి ఇష్టపడతాను` అని మాళవిక తెలిపింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ `నన్ను పెళ్లి చేసుకుంటావా బేబీ?` అంటూ ప్రశ్నించగా.. అందుకు మాళవిక `నాకు దయ్యాలంటే భయం` అంటూ ఫన్నీ అన్సర్ ఇచ్చింది. సదరు యూజర్ ఎక్స్ ఖాతా పేరు ఘోస్ట్ అని ఉండడంతో ఆ విధంగా సమాధానం ఇచ్చింది. మాళవిక ఆన్సర్ కు నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.