వరల్డ్ ఫేమస్ కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్, భారతదేశంలో తమ రెండవ ఎన్-లైన్ మోడల్‌ను విడుదల చేసేందుకు రెడీ అయింది. ఇక ఇప్పటికే ఐ20 ఎన్-లైన్ ను విడుదల చేసిన హ్యుందాయ్, ఇప్పుడు వెన్యూ ఎన్-లైన్ ను కూడా లాంచ్ చేయనుంది.హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ ను కంపెనీ వచ్చే నెల 6వ తేదీన మార్కెట్లో విడుదల చేయనుంది. అయితే, అంతకు ముందే కంపెనీ ఈ స్పెషల్ ఎడిషన్‌ కు సంబంధించిన అనేక వివరాలను వెల్లడి చేసింది. వెన్యూ ఎన్-లైన్ కోసం కంపెనీ ఇప్పటికే బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. ఆసక్తిగల కస్టమర్లు కంపెనీ వెబ్‌సైట్ లో కానీ లేదా హ్యుందాయ్ డీలర్‌షిప్ లలో కానీ బుక్ చేసుకోవచ్చు.వెన్యూ ఎన్-లైన్‌ మొత్తం రెండు వేరియంట్లలో విడుదల కానుంది. వీటిలో వెన్యూ ఎన్-లైన్ ఎన్6 మరియు వెన్యూ ఎన్-లైన్ ఎన్8 అనే రెండు వేరియంట్‌లు ఉన్నాయి. ఇక ఈ ప్రత్యేకమైన ఎన్-లైన్ వెన్యూ  కలర్ ఆప్షన్‌ల విషయానికి వస్తే, ఇది పోలార్ వైట్ అలాగే షాడో గ్రే అనే రెండు మోనో టోన్‌లలో అలాగే, పోలార్ వైట్‌ విత్ ప్లాటినియం బ్లాక్ రూఫ్, పోలార్ వైట్ విత్ ఫాంటమ్ బ్లాక్ రూఫ్ ఇంకా థండర్ బ్లూ విత్ షాడో బ్లాక్ రూఫ్ అనే మూడు టూటోన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.


ప్రస్తుతం, హ్యుందాయ్ సేల్ చేస్తున్న ఐ20 ఎన్-లైన్ మాదిరిగానే వెన్యూ ఎన్-లైన్ కూడా ప్రత్యేకమైన మోటార్‌స్పోర్ట్-ప్రేరేపిత డిజైన్‌తో కారు అంతటా స్పోర్టీ రైడ్ హైలైట్స్‌తో డిజైన్ చేయబడింది. హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ లో స్పోర్టి డిజైన్‌ కోసం కంపెనీ డార్క్ క్రోమ్ ఫ్రంట్ గ్రిల్, స్పోర్టీ టెయిల్‌గేట్ స్పాయిలర్, ఫ్రంట్ గ్రిల్‌పై ఎన్-లైన్ బ్యాడ్జ్, సైడ్ ఫెండర్లు ఇంకా అలాగే టెయిల్‌గేట్ పై ఎన్ బ్రాండింగ్, కొత్త ఎన్-బ్రాండెడ్ 16 ఇంచ్ అల్లాయ్‌లు మొదలైన వాటిని ఉపయోగించింది.స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే వెన్యూ ఎన్-లైన్‌ను బయటి నుండి ఇంకా లోపలి నుండి ప్రత్యేకంగా కనిపించేలా చేసేందుకు ఇందులోని వీల్స్, బంపర్స్, ఫెండర్‌లు, సైడ్ సిల్స్ ఇంకా రూఫ్ రైల్స్ పై అథ్లెటిక్ రెడ్ హైలైట్‌లు, స్పోర్టీ బ్లాక్ ఇంటీరియర్ అలాగే క్యాబిన్ లో అక్కడక్కడా అథ్లెటిక్ రెడ్ ఇన్‌సర్ట్‌లు ఇంకా ఫ్రంట్ బ్రేక్‌లపై రెడ్ కాలిపర్‌లు వంటి ప్రత్యేకమైన స్పోర్టీ రెడ్ హైలైట్ ను ఉపయోగించారు. ఈ మార్పులన్నీ కూడా కొత్త హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ ను మరింత స్పోర్టీగా కనిపించేలా చేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: