
తాజాగా దేశవ్యాప్తంగా బీజేపీ నాయకులు జీఎస్టీ-2.0 సంస్కరణలపై ప్రజలకు అవగాహన కల్పించే ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో జమ్మలమడుగులో కూడా ఆదినారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఆ ర్యాలీలోనే ఆయన ఈ సంచలన ప్రకటన చేశారు. “ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను వెనక్కి అడుగు వేస్తున్నా. కానీ వైసీపీ మళ్లీ అధికారంలోకి రాకుండా చివరి వరకు పోరాడుతా” అంటూ ఫుల్ మాస్ డైలాగ్‌తో స్టేజ్‌ను షేక్ చేశారు. ఇంకా ఆసక్తికర అంశం ఏమిటంటే, తన సీటు అయిన జమ్మలమడుగు అసెంబ్లీ స్థానాన్ని భూపేష్ రెడ్డికి ఇవ్వనున్నారు. ఆయన మాట్లాడుతూ, “చంద్రబాబు గారితో ఈ విషయంపై ఇప్పటికే మాట్లాడాను. భూపేష్‌కి టికెట్ ఇస్తే, నేనే కష్టపడి గెలిపిస్తా” అన్నారు. అంటే, తానే రాజకీయంగా వెనక్కి తగ్గి, యువతకు ఛాన్స్ ఇస్తున్నారన్న మాట.
మరి ఎవరి ఈ భూపేష్ రెడ్డి? అంటే - చడిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి అన్న కుమారుడు. అంటే కుటుంబంలోనే రాజకీయ వారసత్వం కొనసాగనుంది. గత ఎన్నికలకే ఈ సీటు భూపేష్‌కి ఇవ్వాలని అనుకున్నారు కానీ పొత్తు కారణంగా బీజేపీకి కేటాయించారు. అప్పుడు ఆది నారాయణే పోటీచేసి గెలిచారు. గత 30 నెలలుగా భూపేష్ నియోజకవర్గంలో యాక్టివ్‌గా పని చేస్తూ, ప్రజల్లో తన గుర్తింపును పెంచుకున్నారు. ఇక ఇప్పుడు ఆది నారాయణ వెనక్కి తగ్గి, భూపేష్‌ను ముందుకు తెస్తూ “వైసీపీని కూలదోసే మిషన్” ప్రారంభించారు. ఆయన నిర్ణయం వెనుక ఉన్న వ్యూహం - యంగ్ లీడర్ ఫేస్‌తో ప్రజల మనసు గెలుచుకోవడం. జమ్మలమడుగులో ఈ సీన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆది నారాయణ రెడ్డి ప్లాన్ విజయవంతమైతే వైసీపీకి గట్టి షాక్ తప్పదనే చెప్పాలి. “పాలిటిక్స్‌లో పాస్ కాదు బాస్.. ఆది నారాయణ ప్లాన్ మాస్!”