
Facebook, instagram వంటి కొన్ని ప్రముఖ యాప్‌ల యొక్క 'Lite' (లైట్) వెర్షన్‌లను ఉపయోగించడం ద్వారా కూడా ఫోన్ వేగాన్ని మెరుగుపరచవచ్చు. బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యే యాప్‌లను ఎప్పటికప్పుడు క్లోజ్ (Close) చేయడం మంచిది. ఫోన్ ఇంటర్నల్ స్టోరేజీ నిండా ఉంటే, ఫోన్ వేగం తగ్గుతుంది. అందుకే ఎల్లప్పుడూ కొంత ఖాళీ స్థలాన్ని ఉండేలా చూసుకోండి. ఎక్కువగా ఉన్న ఫొటోలు, వీడియోలు మరియు ఇతర ఫైళ్లను google Drive, google Photos లేదా కంప్యూటర్‌లోకి బ్యాకప్ తీసుకొని, ఫోన్ నుండి డిలీట్ చేయండి.
WhatsApp లో వచ్చే ఫార్వార్డ్ మెసేజ్‌లు, అనవసరమైన ఫొటోలు, వీడియోలను తరచూ తొలగించండి. మీరు ఉపయోగించే ప్రతి యాప్ కొంత క్యాచ్ (Cache) డేటాను నిల్వ చేస్తుంది. దీనివల్ల కూడా ఫోన్ నెమ్మదిస్తుంది. సెట్టింగ్స్‌లోకి వెళ్లి, ఒక్కో యాప్ యొక్క క్యాచ్ డేటాను అప్పుడప్పుడు క్లియర్ చేయండి. లేదా 'క్లీనర్' యాప్‌లను ఉపయోగించవచ్చు. అలాగే, బ్రౌజర్ యొక్క కుకీలు (Cookies), క్యాష్ (Cache) కూడా క్లియర్ చేయడం ఇంటర్నెట్ వేగాన్ని పెంచుతుంది.
చాలా చిన్న సమస్యలకు లేదా ram క్లియర్ అవ్వడానికి ఫోన్‌ను రీస్టార్ట్ చేయడం ఒక సులభమైన, ప్రభావవంతమైన పరిష్కారం. వారానికి కనీసం ఒక్కసారైనా ఫోన్‌ను రీస్టార్ట్ చేయడం మంచిది. మీ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ (OS) మరియు యాప్‌లను ఎప్పటికప్పుడు తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేస్తూ ఉండాలి. కొత్త అప్‌డేట్‌లు సాధారణంగా పనితీరును మెరుగుపరుస్తాయి మరియు సమస్యలను పరిష్కరిస్తాయి.
కొన్ని స్మార్ట్‌ఫోన్లలో యానిమేషన్స్ ఎక్కువగా ఉండటం వల్ల అవి స్లోగా అనిపిస్తాయి. Developer Options సెట్టింగ్స్‌లో Window Animation Scale, Transition Animation Scale, మరియు Animator Duration Scale లను 0.5x లేదా ఆఫ్ చేయడం ద్వారా ఫోన్ ఇంటర్ఫేస్ వేగం పెరుగుతుంది.