ఇక కార్లు కొనుగోలు చేయాలనుకునేవారు ఎక్కువగా సేఫ్టీకే ప్రాధాన్యత చూపుతున్నారు. ముఖ్యంగా కారు కొనుగోలుదారులు వెహికల్ స్ట్రాంగ్‌నెస్ ఇంకా అందులో అందించే సేఫ్టీ ఫీచర్స్ గురించి ఖచ్చితంగా తెలుసుకుంటున్నారు.ఆటోమోబైల్ ఇండస్ట్రీ కూడా ప్రయాణికుల ప్రాణాలను కాపాడే దిశగా ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతోంది. ఇక కారు తయారీ కంపెనీలు తమ కార్లలో సేఫ్టీ ఫీచర్లకు చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాయి. అలాంటి కంపెనీలలో దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ముందుంటోంది. రీసెంట్‌గా ఈ కంపెనీ టాటా పంచ్ 2023 మైక్రో SUV కార్ ని అడ్వాన్స్‌డ్‌ సేఫ్టీ ఫీచర్లతో అందుబాటులోకి తెచ్చింది.ఇక ఈ కారు SUV-వంటి డిజైన్, స్టైలింగ్‌తో విడుదలైన ఒక హ్యాచ్‌బ్యాక్ కార్ . ఇది టాటా నెక్సాన్, హారియర్ లైట్ వెర్షన్‌ లాగా కనిపిస్తుంటుంది. రూ.5,99,900 (ఎక్స్-షోరూమ్-ఢిల్లీ) స్టార్టింగ్ ప్రైస్‌తో అందుబాటులో ఉన్న ఈ టాటా పంచ్‌ కార్ లో 1.2 రెవోట్రాన్ ఇంజన్‌ను ఫిక్స్ చేశారు. ఇది సిటీ రోడ్లపై ఈజీగా దూసుకెళ్లడమే కాకుండా ఎగుడు దిగుడు భూభాగాలపై కూడా చాలా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ ని ఇస్తుంది. అందుకోసం దీనిలో 187mm గ్రౌండ్ క్లియరెన్స్ ని ఫిక్స్ చేశారు. దీని వీల్‌బేస్ వచ్చేసి 2,445mm సైజు ఉంటుంది.ఇక టాటా పంచ్ 2023 కారు 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT ఆప్షన్లతో మార్కెట్లోకి వస్తుంది.


దీని పవర్ ఔట్‌పుట్ విషయానికి వస్తే ఇది 86PS పవర్, 113Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వచ్చే ఈ కారులో ప్యూర్, అడ్వెంచర్, అకంప్లిష్డ్ ఇంకా క్రియేటివ్ అనే నాలుగు స్పెషల్ ట్రిమ్స్‌ ఉన్నాయి. ప్రతి వెర్షన్ కూడా దాని డిఫరెంట్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో లభిస్తాయి. అయితే అడ్వెంచర్, అకంప్లిష్డ్ ట్రిమ్‌లు కామో ఎడిషన్‌లో ఆప్షనల్ రిథమ్ & డాజిల్ యాక్సెసరీ సెట్‌లతో అందుబాటులో ఉన్నాయి. ఇక అలాగే టాప్-స్పెక్ క్రియేటివ్ ట్రిమ్ కాజిరంగా ఎడిషన్‌తో లభిస్తుంది. కామో, రిథమ్ & డాజిల్ ఇంకా కజిరంగా ఎడిషన్లలో ఏది నచ్చితే దానిని కొనుగోలుదారులు ఈ కార్ ని సొంతం చేసుకోవచ్చు.ఇంకా ఈ కారులో 7-అంగుళాల టచ్‌స్క్రీన్, యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, హర్మాన్ ఆడియో సిస్టమ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్ ఇంకా స్టీరింగ్-మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే పుష్-బటన్‌ స్టార్ట్‌తో కూడిన కీలెస్ ఎంట్రీలతో పాటు మొత్తం నాలుగు పవర్ విండోలనేవి కూడా ఉన్నాయి. ఈ కారు టోర్నాడో బ్లూ, కాలిప్సో రెడ్, మీటియర్ బ్రాంజ్, అటామిక్ ఆరెంజ్, ట్రాపికల్ మిస్ట్, ఫోలేజ్ గ్రీన్, డేటోనా గ్రే ఇంకా ఓర్కస్ వైట్‌లతో సహా మొత్తం ఎనిమిది రంగులలో వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: