అమెరికాలోని న్యూ మెక్సికోలోని అల్బుకెర్కీలో శనివారం హాట్ ఎయిర్ బెలూన్ విద్యుత్ లైన్‌ను డీకొనడంతో ఐదుగురు మరణించారు. మరణించిన వారిలో ఒక మగ, ఒక ఆడ ప్రయాణీకులు, పైలట్‌ తో పాటు నగర పోలీసు శాఖతో జైలు రవాణా అధికారి తల్లిదండ్రులు ఉన్నారు. నగర పోలీసు శాఖ ప్రకారం, ప్రయాణికులు ఉన్న బుట్ట హాట్ ఎయిర్ బెలూన్ నుండి వేరుచేయబడి క్రాష్ అయ్యింది. 

ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఎఎఎ) ప్రకారం, బుట్ట 30 మీటర్ల ఎత్తు నుంచి వీధిలో కూలిపోయిన తరువాత మంటలు చెలరేగాయి. శనివారం ఉదయం 7 గంటల తర్వాత ఈ సంఘటన జరిగిందని పోలీసు ప్రతినిధి గిల్బర్ట్ గాలెగోస్ బిబిసి నివేదికలో పేర్కొన్నారు. ఈ ప్రమాదం కారణంగా ఈ ప్రాంతంలో 13,000 ఇళ్ళకు తాత్కాలికంగా విద్యుత్తు నిలిపివేయబడింది. సహాయక చర్యలు పూర్తి అయ్యాక విద్యుత్ పునరుద్ధరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: