భార‌త క్రీడాకారుల‌కు ఇచ్చే అత్యున్న‌త పుర‌స్కారాలైన మేజ‌ర్ ధ్యాన్‌చంద్ ఖేల్ ర‌త్న పుర‌స్కారాల ప్ర‌దానోత్స‌వంను ఇవాళ ఢిల్లీలోని రాష్ట్రప‌తిభ‌వ‌న్‌లో నిర్వ‌హించారు. ప‌లు క్రీడ‌ల్లో విశేష ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన క్రీడాకారుల‌కు రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ ప్ర‌దానం చేసారు. ధ్యాన్‌చంద్ ఖేల్‌ర‌త్న అవార్డుల‌ను మహిళా క్రికెటర్ మిథాలీరాజ్, టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా, రెజ్లర్ రవి కుమార్, బాక్సర్ లొవ్లీనా బోర్గోహాయిన్, హాకీ ప్లేయర్ శ్రీజేష్ పీఆర్, పారా షూటర్ అవని లేఖరా, పారా అథ్లెట్ సుమిత్ అంతిల్ అందుకున్నారు.

అర్జున అవార్డుల‌ను  శిఖర్ ధావన్ (క్రికెట్), నిషద్ కుమార్ (హైజంప్), ప్రవీణ్ కుమార్ (హైజంప్), శరద్ కుమార్ (హైజంప్), యోగేష్ కథునియా (డిస్కస్ త్రో), సుహాస్ ఎల్వై (బ్యాడ్మింటన్), సింగ్‌రాజ్ అధానా (షూటింగ్), భవినా పటేల్ (టేబుల్ టెన్నిస్), హర్విందర్ సింగ్ (ఆర్చరీ) రంగాల‌లో రాష్ట్రప‌తి చేతుల మీదుగా అందుకున్నారు. దేశంలోనే అత్యున్న‌త‌స్థాయి క్రీడా పురస్కారం మేజ‌ర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌ర‌త్న‌ను కేంద్ర ప్ర‌భుత్వం అందేస్తుంది. అయితే నాలుగేండ్ల‌కు పైగా క్రీడారంగంలో స‌త్తా చాటిన వారిని పుర‌స్కారాల‌కు ఎంపిక చేస్తారు. విజేత‌ల‌కు ట్రోఫీ, సైటేష‌న్ న‌గ‌దు బ‌హుమ‌తిని అందిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: