ఇక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఫేస్‌బుక్‌ ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫేస్ బుక్ వరల్డ్‌ ఫేమస్‌ అనే విషయం అందరికి కూడా తెలుసు. అయితే వీళ్లు మాత్రం కేవలం ఒక్క ఫేస్‌బుక్‌తోనే ఆగిపోలేదు. వాట్సాప్‌ను కూడా టేకోవర్ చేశారు. ఫేస్‌బుక్‌ ఇంకా వాట్సాప్‌ ఈ రెండు కూడా సోషల్‌ మీడియాలో ప్రపంచంలో రారాజులుగా ఉన్నాయి.వినియోగదారులను పెంచుకుంటూ చాలా స్పీడ్ గా దూసుకుపోతున్నాయి.ఇక ఇలానే పెద్ద పెద్ద కంపెనీలు కూడా బాగా వేగంగా వృద్ధి చెందుతున్న కంపెనీలను టేకోవర్ చేస్తున్నాయి. ప్రత్యేకించి- దేశీయ పారిశ్రామిక దిగ్గజం అయిన ముఖేష్ అంబానీ(Mukhesh Ambani) సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ ఇతర కంపెనీల్లో వాటాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం ఇంకా అలాగే వాటిల్లో పెట్టుబడులు పెట్టడం ఇంకా వీలైతే వాటిని పూర్తిగా టేకోవర్ చేయడం చేస్తుంది. రిటైల్ బిజినెస్, ఫ్యాషన్, అప్పెరల్స్, టెలి కమ్యూనికేషన్స్ ఇంకా గ్రోసరీస్..వంటి రంగాల్లో కూడా భారీగా పెట్టుబడులు పెట్టింది రిలయన్స్ కంపెనీ.



రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance) దాదాపు అన్ని రంగాల్లో కూడా అడుగు పెట్టి సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది.అలాగే లోకల్ సెర్చింజిన్‌ను జస్ట్ డయల్(Just Dail) కూడా రిలయన్స్ సొంతం చేసుకుంది. ఇక ఈ రిలయన్స్‌ను ఎదుర్కొనేందుకు పోటీ కంపెనీలు కూడా ప్రయత్నాలను మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కూడా టేకోవర్లపై దృష్టి పెట్టింది. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఇదీ కూడా ఒకటి. రిటైల్ సెగ్మెంట్‌ను నెలకొన్న పోటీని ఎదుర్కొనడానికి టాప్ బ్రాండ్స్‌కు చెందిన కంపెనీలను కొనుగోలు చేసే దిశగా అనేక రకాల చర్యలు తీసుకుంటోంది. దీనికోసం ఇప్పటికే చర్చల ప్రక్రియ కూడా స్టార్ట్ చేసినట్లు సమాచారం తెలుస్తుంది. ఇక టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ డిసౌజా ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది.టాప్ బ్రాండింగ్స్‌ను కొనుగోలు చేయడంపై ఇప్పటికే దృష్టి పెట్టామని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: