సాధార‌ణంగా ప్ర‌తి ఒక్క‌రూ చర్మ సోయగాన్ని పెంచుకునేందుకు రకరకాల సౌందర్య ఉత్పత్తులు ఉప‌యోగిస్తుంటారు. వీటిలో ఏ ఉత్పత్తి సహజమైనది, సురక్షితమైనది మరియు చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను తగ్గించేవి కావు. ఆఖరికి ఇవి ఏ సమస్యను సహజాంగా నివారించలేవు. మ‌రియు వాటితో బోల్డెన్ని ప్లాస్టిక్‌ వ్యర్థాలు చ‌ర్మ ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి. ఇలాంటి ప్రాడెక్ట్స్ కాకుండా.. స‌హ‌జ చిట్కాల‌ను ఉప‌యోగించ‌డం చ‌ర్మానికి మంచిది.

IHG

అయితే అలాంటివాటిలో తులిసి కూడా ఒక‌టి. వాస్త‌వానికి తులసి గొప్ప ఔషధంగా పనిచేస్తుంది. కడుపులోకి తీసుకునే తులసి రసం, రక్తశుద్ధికి దివ్యంగా పనిచేస్తుంది. అలాగే, ముఖం మీద లేపనంగా వాడితే మచ్చలు, మరకలు పోయి ముఖం అందంగా మ‌రియు కాంతివంతంగా మారుతుంది. చర్మం యవ్వనంతో తొణికిసలాడేలా తులసి చేయగలదు. ముసలి ఛాయలు త్వరగా దరిచేరనివ్వదు.

IHG

మ‌రి తుల‌సిని చ‌ర్మానికి ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. అందులో ముందుగా.. తులసి ఆకుల ర‌సంలో, ఎండిన నారింజ తొక్కల పొడి మిశ్రమాన్ని క‌లిపి చ‌ర్మానికి అప్లై చేయాలి. పదిహేను నిమిషాల తర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై ఉన్న మ‌చ్చ‌లు, మొటిమ‌లు త‌గ్గుతాయి. అలాగే ముఖం య‌వ్వ‌నంగా క‌నిపిస్తుంది. అదేవిధంగా, తులసి ఆకులను ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. 

IHG

దీనికి కొంచం నీరు కలిపి మొఖానికి రాసుకోవాలి. ఈ ప్యాకు చర్మ రంద్రాలను తెరుచుకోలాగా చేస్తుంది. దీంతో చర్మం ఫై పెరుకుపోయీన మురికి సులువుగా తొలగి పోవడమే కాకుండా చర్మం కొత్త మెరుపును సంతరించుకుంటుంది. కాబ‌ట్టి.. ఈ చిట్కాల‌ను ఖ‌చ్చితంగా ట్రై చేయండి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: