ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.... నెయ్యి ప్రకృతి ఇచ్చిన ప్రసాదం లాంటిది.. నెయ్యితో అనేక లాభాలు వున్నాయి. నెయ్యి కేవలం రుచికి, ఆరోగ్యానికే కాదు అందానికి కూడా చాలా మంచిది. చాలా మంది అనేక రకాల ముఖ సమస్యలతో, జుట్టు సమస్యలతో బాధ పడుతూ ఉంటారు.జిడ్డు బారిన ముఖంతో, మొటిమలు, మచ్చలు సమస్యలతో ఇంకా అలాగే జుట్టు రాలే సమస్యలతో ఎన్నో విధాలుగా సతమతమవుతూ ఉంటారు. ఇక ఆ సమస్యలు నుంచి విముక్తి పొందడానికి నెయ్యి ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఆ టిప్స్ ఏంటో తెలుసుకోండి....


నెయ్యిలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ మంచి కండిషనర్ లా పని చేస్తాయి. రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిలో ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి జుట్టుకి అప్లై చేయండి. ఇరవై నిమిషాలు అలాగే ఉంచేసి తరువాత కడిగేయండి. ఈ ప్యాక్ జుట్టుని సాఫ్ట్ గా మ్యానేజ్ చేసేందుకు వీలుగా చేస్తుంది. నెయ్యిలో నిమ్మరసం కలిపి చుండ్రుని ట్రీట్ చేయడానికి కూడా వాడవచ్చు. మీ స్కాల్ప్ ని బాగా మసాజ్ చేయడం మర్చిపోకండి.ఇక మన పెదాలు ఎండకి పగిలిపోతుంటాయి.పొల్యూషన్, సన్‌రేస్, దుమ్ము, పొగ వల్ల అవి వాటి నాచురల్ పింక్ కలర్ ని పోగొట్టుకుంటాయి. ఇందుకు మీరు చేయవలసిందల్లా కొద్దిగా నెయ్యి వెచ్చ చేసి రాత్రి నిద్రకి ముందు ఆ నెయ్యిని పెదవులకి అప్లై చేయడమే. మీరు నిద్ర లేచేప్పటికి మీ లిప్స్ పైన డ్రై ఫ్లేక్స్ కనబడతాయి. వాటిని స్క్రబ్ చేసేయండి. ఇలా రోజూ చేశారంటే ఫలితం మీకే తెలుస్తుంది.మీ పెదాలు మృదువుగా మారిపోతాయి..


ఇక నెయ్యి చర్మ సౌందర్యానికి చాలా మంచిది..ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ స్కిన్ కి కూడా ఎంతో హెల్ప్ చేస్తాయి. చర్మానికి మంచి మెరుపునిస్తాయి. ఇక్కడ ఉన్న ఫేస్ మాస్క్ తో మృదువైన మెరిసే చర్మం మీ స్వంతం చేసుకోవచ్చు. రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి, ఒక టీ స్పూన్ పసుపు వేసి కొద్దిగా నీరు కలిపి పేస్ట్ లా చేయండి. ఈ పేస్ట్ ని ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాలు అలాగే ఉంచేయండి. ఆ తరువాత చల్లని నీటితో కడిగేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే బాగా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.ఆకట్టుకునే అందం మీ సొంతం అవుతుంది. ఇక ఇలాంటి మరెన్నో బ్యూటీ టిప్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో సౌందర్య చిట్కాలు గురించి తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి: